రివ్యూ : ‘9 అవర్స్’ వెబ్ సిరిస్

దర్శకుడు క్రిష్ ని మెచ్చుకోవాలి. కథల కోసం తెలుగు సాహిత్యం వైపు చుస్తున్నారాయన. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల కొండపొలంను అదే పేరుతో సినిమాగా తీశారు. ఇప్పుడు మల్లాది వెంకట కృష్ణమూర్తి రచన తొమ్మిది గంటలు నవల ఆధారంగా 9 HOURS పేరుతో వెబ్ సిరిస్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. నిరంజన్ కౌశిక్, జాకోబ్ వర్గిస్ దర్శకులుగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ సిరిస్ రిలీజ్ అయ్యింది. 1985 లో రాసిన నవల ఇది. మూలకథలో ఎలాంటి మార్పులు చేయకుండా అదే కాలంలో చూపించిన ఈ కథలోకి వెళితే..

జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు రోల్‌ కాల్‌ అవగానే జైలు నుంచి తప్పించుకుని బయటకు వస్తారు. ముగ్గురు మూడు గ్రూపులుగా విడిపోయి హైదరాబాద్‌ ‘డెక్కన్‌ ఇంపీరియల్‌ బ్యాంక్‌’కు సంబంధించిన మూడు బ్రాంచ్లో దొంగతనం చేయడానికి వెళ్తారు. ఈ రాబరికీ దశరద్ (అజయ్ ) అనే ఖైధీ ప్లాన్ వేస్తాడు. రెండు బ్రాంచ్ లో ముందు అనుకున్న వ్యుహ్యం ప్రకారమే రాబరీ జరుగుతుంది. కానీ కోఠీ బ్యాంక్ దొంగతనం బెడిసి కొడుతుంది. దొంగలు బ్యాంకు లో చిక్కుకుంటారు. పోలీసులకు దొంగతనం ఇన్ఫర్మేషన్ చేరుతుంది. బ్యాంక్ లోని దొంగలను పట్టుకునే పనిని సీఐ ప్రతాప్ (తారకరత్న)కు అప్పగిస్తాడు ఏపీసీ. విషయం మీడియాకి కూడా లీక్ అవుతుంది. బయట పోలీసులు, మీడియా.. బ్యాంకు లోపల దొంగలు బందీలు .. జైలు రోల్‌ కాల్‌ కి తొమ్మిది గంటలు మిగిలివుంటుంది. ఈ తొమ్మిది గంటల్లో మళ్ళీ దొంగలు జైలులోకి వెళ్ళాలి. మరి ఆ దొంగలు బ్యాంకు నుంచి బయటపడ్డారా? బ్యాంకు లో చికుకున్న బందీల పరిస్థితి ఏంటి? అసలు దొంగలు జైలు నుండి అంత సులువుగా ఎలా తప్పించుకున్నారు ? ఈ రాబరీ వెనుక వున్నది ఎవరు ? అనేది మిగతా కథ.

వెబ్ సిరిస్ కి కథ చేయడం అంత తేలిక కాదు. ప్రతి పాత్ర చుట్టూ ఒక కథ వుండాలి. ఆ కథ మూలకథకి లింకైవుండాలి. ప్రతి ఎపిసోడ్ లో ఆసక్తికరమైన సన్నివేశాలతో సిరిస్ చివరిదాక ప్రేక్షకుడిని తీసుకెళ్ళిపోవాలి. ఇలాంటి సెటప్ ఉన్నప్పుడే వెబ్ సిరిస్ రక్తికడుతుంది. తొమ్మిది గంటలు నవల కూడా వెబ్ సిరిస్ కి పనికొచ్చే మెటిరియలే. 9 అవర్స్ ని తొమ్మిది ఎపిసోడ్లుగా విభజించారు. జైలు నుండి దొంగలు పారిపోవడం, బ్యాంక్ లోకి చొరబడటం, అక్కడ అనూహ్యంగా ఇరుక్కోవడం .. ఇవన్నీ ఆసక్తికరంగా సాగాయి. బ్యాంకు లోపల కూడా కావాల్సినంత డ్రామాని బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్ల పాత్రలో క్రియేట్ చేశారు. రిటైర్మెంట్ చివరి రోజున ఒక మ్యానేజర్, ఆ రోజే జాయిన్ అయిన ఉద్యోగి, చెక్ మార్చుకోవడానికి బ్యాంక్ కి వచ్చిన హీరో, కామంతో కొట్టుకుంటున్న మరో బ్యాంక్ ఉద్యోగి .. తొలి చూపులోనే ప్రేమలో పడిన ఓ జంట ఇలా అన్నీ ఆసక్తికరమైన పాత్రలే. ఇక దొంగలుగా వచ్చిన ముగ్గురు, వారికి సహకరించడానికి వచ్చిన ఒక వేశ్య పాత్ర.. ఆమె చుట్టూ ఓ కథ.. బయట పోలీసులు, మీడియా.. జైలులో జరిగే పాలిటిక్స్ .. ఒక సిరిస్ నడపడానికి ఈ మాత్రం డ్రామా చాలు. ఐతే 9 HOURSలో ఇంత డ్రామా వుంది కానీ దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో తడబాటు కనిపిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కొరవడింది.

బ్యాంకులో వున్న వ్యక్తులని దొంగలు బందీలుగ పట్టుకున్న తర్వాత నడిచే డ్రామా రొటీన్ గానే వుంటుంది. రాబరీ డ్రామాలు ఎప్పుడూ కూడా ఇంటెన్స్ గా వుండాలి. ఇందులో ఆ తీవ్రత తగ్గింది. ఈ కథ 85నాటిది. ఆ కాలం నాటి స్వభావలే పాత్రలలో కనిపిస్తాయి. రాబరీ కథ చేసినప్పుడు మైండ్ గేమ్ చాలా ముఖ్యం. ఇందులో ఆలాంటి మైండ్ గేమ్ ఏమీ కనిపించదు. కథలో వున్న ఒరిజినాలిటీ ఏమో కానీ ఇందులో కథానాయకుడు అంటూ ఎవరూ కనిపించరు. ఎవరి కోణం నుండి కథని ఫాలో అవ్వాలనే ఆప్షన్ కనిపించదు. ఏ పాత్రకు కూడా ప్రత్యేకమైన ఎలివేషన్ వుండదు. ఇది ఒక రకంగా కొత్తదనమే అనుకోవాలి. సిరిస్ లో ఎక్కువ బాగం దొంగలు, బందీల మధ్య నడుస్తుంది. దొంగల నుండి తప్పిచుకోవాడానికి బందీలు చేసే కొన్ని ప్రయత్నాలు ఆసక్తికరంగానూ మరి కొన్ని సాగాదీతగా అనిపిస్తాయి.

ఇందులో ప్రతి దొంగకి డిఫరెంట్ కోణం వుంటుంది. ఒకడు తన ప్రేయసితో ఆనందంగా బ్రతకాలని ఆశపడతాడు. మరొకడు తన మంచితనాన్ని లోపల పెట్టుకొని చెడ్డవాడిగా నటిస్తాడు. ఒక పెద్దాయన హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతే మిగతా దొంగలంతా కేసు అవుతుందని భయఅడతారు. దొంగల పాత్రల స్వభావం ఇలా వున్నపుడు.. వీళ్ళంతా మంచి దొంగలే అనే భావన ప్రేక్షకుడిలో వచ్చేస్తుంది. ఐతే ఇక్కడే కథలో మరో పాయింట్ ని ప్రవేశ పెట్టారు. అసలు దొంగతనం డబ్బు గురించి కాదు.. దిని ఉద్దేశం వేరే వుందని మరో అంశాన్ని తెరపై తెచ్చారు. ఐతే ఈ పాయింట్ మొత్తాన్ని సెకండ్ సీజన్ కి దాచేశారు. దశరద్ పాత్ర రూపంలో ఓ ట్విస్ట్ ఇచ్చి దొంగలు బ్యాంకు నుండి పోలీసులను తప్పించుకుపారిపోవడంతో సీజన్ 1ముగుస్తుంది.

నటీనటులు విషయానికి వస్తే ఇందులో అజయ్ ది కథని మలుపు తిప్పే పాత్ర. నిడివి తక్కువ ఉన్నప్పటికీ ఆ పాత్రపైనే కథ మొదలై.. ముగుస్తుంది.జైలర్ గా చేసిన వినోద్ కుమార్ పాత్ర కూడా కీలకం. తారకరత్న చాలా రోజుల తర్వాత కనిపించారు. ఐతే ఆ పాత్రని చాలా లిమిట్ చేశారు. రిపోర్టర్ గా చేసిన మధుశాలిని పాత్రలో ఓ ట్విస్ట్ వుంది. రాబరీ బ్యాచ్ లో కోటి, శ్రీతేజ్, రవి వర్మలు పరిధి మేర చేశారు. రవివర్మకు చాలా నిడివి వున్న పాత్ర దక్కింది. టీ బాయ్ కి రవి వర్మకి జరిగిన ఒక సంభాషణ ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా వుంటుంది. ”నేను మంచోడినని ఎక్కడా చెప్పకు” అనే డైలాగ్ చెప్పించిన సందర్భం బావుంది. బ్యాంకు సిబ్బందిగా కనిపించిన రాజ్ మాదిరాజ్ ప్రీతి అస్రాని గిరిధర్ పాత్రలు ఓకే. కామపిశాచి గా గిరిధర్ పంచిన విలనిజం అతనికి కొత్తగా వుంది. హీరోగా చేసిన సమీర్ పాత్రని ఇంకా వాడాల్సింది. మిగతా నటీనటులు పరిధి మేర చేశారు.

85పరిస్థితులు కనిపించేలా టెక్నికల్ టీమ్ కష్టపడింది. డైలింగ్ ఫోన్లు, ఎస్టీడీ బూత్లు, వాకీటాకీలు, అం,అంబాసిడర్ కార్లు , వీడియో పార్లర్ ..కాస్త్యుమ్స్, బ్యాంకు పరిసరాలు అన్నీ చక్కగా తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలు మరీ గొప్పగా లేవు అలాని పేలవంగా అనిపించవు. నేపధ్య సంగీతం ఓకే.

9అవర్స్ సిరిస్ లోఉత్కంఠ తగ్గింది కానీ నిజానికి నవలలో వున్నమ మూలకథ బావుంది. ఈ సిరిస్ సినీ రచయితలు దర్శకులు తెలుగు సాహిత్యంపై ద్రుష్టి చూపాల్సిన అవసరం వుందని మరో తెలియజేసింది. ‘మనీ హీస్ట్’ అనే వెబ్ సిరిస్ ని రాబరీ కథలకు గ్రేట్ ఎక్సాంపుల్ గా చూపిస్తున్నారు. కానీ తొమ్మిది గంటలు నవలలో వున్నా పాయింట్ మనీహీస్ట్ కి ఏ మాత్రం తక్కువ కాదు. ఒక బ్యాంకు రాబరీ, బందీలు, బ్యాంకు బయట పోలీసులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, దొంగలకు పోలీసులకు మధ్య మైండ్ గేమ్.. మీడియా.. ఇలాంటి నేపధ్యమే మనీహీస్ట్ లో కనిపిస్తుంది. ఇలాంటి నేపధ్యం 85లోనే రాసేసిన మల్లాదిని మెచ్చుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close