లోకేష్ జూమ్‌ మీటింగ్‌లోకి చొరబడిన కొడాలి, వంశీ

పదో తరగతి ఫెయిలయిన విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ పెట్టారు. వారితో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చదువులు సాగిన వైనం.. టీచర్ల కొరత ఇలాంటి అంశాలపై మాట్లాడుతున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. అయితే హఠాత్తుగా ఇద్దరు విద్యార్థులను పక్కకు తప్పించి మీటింగ్‌లోకి్ కొడాలి నాని, వల్లభనేని వంశీ వచ్చారు. ఇద్దరు విద్యార్థినుల పేరుతో లాగిన్ అయ్యారు. అయితే వారికి జూమ్ మీటింగ్ జరుగుతుందో లేదో అర్థం కాలేదు. కొడాలి నాని …, విద్యార్థినిని పక్కకు పంపేసిన తాను సీట్లో కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కానీ.. ఏమీ అర్థం కాక మళ్లీ తీసేశారు.

వల్లభనేని వంశీ ఆఫీసు నుంచి ఓ విద్యార్థిని లాగిన్ అయింది.. ఆ విద్యార్థిని మాట్లాడుతూండగా.. ల్యాప్ ట్యాప్ తీసుకెళ్లి ఆయనకు ఇచ్చారు. ఆయన వెకిలి నవ్వులు నవ్వారు. వీరితో పాటు మరికొంత మంది వైసీపీ నేతలు కూడా జూమ్ కాల్‌లోకి చొరబడినట్లుగా తెలుస్తోంది. కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూడా ఫెయిలయిన విద్యార్థుల పేర్లతో ఐడీ తీసుకుని తర్వాత ఎంట్రీ ఇచ్చారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. విద్యార్థులతో మాట్లాడుతూంటే.. మధ్యలో వీరు వచ్చి ఎం చేస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది.

ఓ సమావేశంలో చొరబడటం మాత్రమే కాకుండా రాజకీయం చేయాలని చూడటంతో .. ఇదేం వెకిలి చేష్టలన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తంది. ఇది టెన్త్ ఫెయిలయిన వాళ్ల కోసమేనని.. కానీ వాళు కూడా టెన్త్ ఫెయిల్ బ్యాచేనా అని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా నారా లోకేష్ ఏం చేస్తున్నారా అని టార్గెట్ పెట్టుకుని పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి .. ఆయన వ్యవహారాల్ని డిస్టర్బ్ చేయడానికి వైఎస్ఆర్‌సీపీ పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close