షారుఖ్ సినిమాలో రానా?

సౌత్ ఇండియ‌న్ క‌థ‌ల‌పైనే కాదు, ఇక్క‌డి ద‌ర్శ‌కులు, న‌టీన‌టుల‌పై ఫోక‌స్ పెడుతున్నారు బాలీవుడ్ జ‌నాలు. మొన్న‌టికి మొన్న‌.. త‌న సినిమాలో వెంక‌టేష్ కోసం ఓ కీల‌క పాత్ర అప్ప‌గించాడు స‌ల్మాన్ ఖాన్‌. అంతేకాదు.. రామ్ చ‌ర‌ణ్‌కీ త‌న సినిమాలో స్థానం ఇచ్చాడు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా అదే చేయ‌బోతున్నాడ‌ని టాక్‌.

షారుఖ్ – అట్లీ కాంబినేషన్ లో జ‌వాన్ అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీల‌కమైన పాత్ర కోసం సౌత్ ఇండియ‌న్ స్టార్‌ని తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం. ఆ అవ‌కాశం రానాకి ద‌క్కింద‌ని టాక్‌. చిత్ర‌బృందం ఇప్ప‌టికే రానాతో సంప్ర‌దింపులు మొద‌లెట్టింద‌ని స‌మాచారం. బాలీవుడ్ లో అడ‌పా ద‌డ‌పా మెరిసినా.. ఇప్ప‌టి వ‌ర‌కూ స‌రైన బ్రేక్ రాలేదు రానాకి. కాక‌పోతే.. అక్క‌డ త‌న‌కు మంచి గుర్తింపే ఉంది. షారుఖ్ – అట్లీ కాంబోపై చాలా క్రేజ్ ఏర్ప‌డింది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ గ్లిమ్స్ కూడా అభిమానుల్ని ఆక‌ట్టుకుంది. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల్ని అమాంతంగా పెంచేసింది. అందుకే రానా ఈ ఆఫ‌ర్‌కి నో చెప్పే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. రానా యాడ్ అయితే.. ఈ సినిమాకి మ‌రింత‌గా సౌత్ ఇండియ‌న్ సినిమా ఫ్లేవ‌ర్ రావ‌డం ఖాయం. గ‌తంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా కూడా పూర్తిగా సౌత్ ఇండియ‌న్ ఫ్లేవ‌ర్‌తోనే తీశాడు షారుఖ్‌. ఆ త‌ర‌వాత‌.. త‌ను మ‌రో హిట్ అందుకోలేక‌పోయాడు. అందుకే మ‌రోసారి సౌత్ ఇండియ‌న్ రెసిపీని న‌మ్ముకొన్న‌ట్టున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close