‘డీజే టిల్లు 2’.. ద‌ర్శ‌కుడు దొరికాడు

చిన్న సినిమాగా విడుద‌లై.. సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిన సినిమా `డీజే టిల్లు`. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌… రేంజ్‌నీ, మార్కెట్ నీ అమాంతం పెంచేసిన సినిమా ఇది. దీనికి సీక్వెల్ కూడా ప‌ట్టాలెక్కేసింది. అయితే ద‌ర్శ‌కుడు మారాడు. డీజే టిల్లుని డైరెక్ట్ చేసిన విమ‌ల్ కృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచీ.. ఈ క‌థ‌ని డీల్ చేయ‌గ‌లిగే ద‌ర్శ‌కుడి కోసం చిత్ర‌బృందం అన్వేషిస్తోంది. ఇప్పుడు ఆ ద‌ర్శ‌కుడు దొరికేశాడు. త‌నే… మ‌ల్లిక్ రామ్.

`అద్భుతం` అనే సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు మ‌ల్లిక్‌. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం… ఓటీటీలో విడుద‌లై, మంచి ఆద‌ర‌ణ పొందింది. ఇప్పుడు `డీజే టిల్లు 2` ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు ఈ మ‌ల్లిక్‌కే అప్ప‌గించారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ డిస్క‌ర్ష‌న్స్‌లో మ‌ల్లిక్ కూడా పాలు పంచుకొంటున్నాడు. సిద్దు జొన్న‌లగడ్డ‌నే ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు అందిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close