పబ్లిసిటి పీక్.. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే వీక్ !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ వారం రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్ నుంచి ఢిల్లీకి అనుసంధానం చేసే ఎక్స్ ప్రెస్‌ వేను ప్రారంభించారు. పదిహేను వేల కేంద్ర నిధులతో నిర్మించిన ఈ రహదారి వల్ల బుందేల్ ఖండ్ జాతకం మారిపోతుందని ప్రచారం చేశారు. ఈ రహదారి వీడియోలు కూడా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇది అమెరికా కాదు.. ఆస్ట్రేలియా కాదు.. దుబాయ్ అంత కంటే కాదు.. మన దేశంలోనే.. మోడీ సర్కార్ బుందేల్ ఖండ్‌లో నిర్మించిన ఎక్స్ ప్రెస్ వే అంటూ ఎలివేషన్లుఇచ్చారు.

వారం రోజుల తర్వాత ఇప్పుడు మరోసారి ఆ రహదారి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ భిన్నమైన కారణంతో. భారీ వర్షాలు రావడంతో ఎక్స్ ప్రెస్‌ చాలా చోట్ల కొట్టుకుపోయింది. కొన్ని చోట్ల గొయ్యిలు పడిపోయాయి.దీంతో ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది. వేల కోట్లు పెట్టి నిర్మించిన ఈ రోడ్ దుస్థితి ఇప్పులు అయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అవినీతి అంటే ఇదని ఫోటోలు పెట్టి చూపిస్తున్నారు. సాధారణంగా ఎక్స్ ప్రెస్ వేలు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల్లోనూ దెబ్బతినకుండా స్ట్రాంగ్‌గా నిర్మిస్తారు.

కానీ భయంకరమైన వరదలేమీ రాకుండానే ఆ ఎక్స్ ప్రెస్ వే చాలాచోట్ల దెబ్బతింది. రిపేర్లు చేసి మళ్లీ ఎక్స్ ప్రెస్ వేను వినియోగంలోకి తీసుకు రావొచ్చు కానీ.. అసలు మరక మాత్రం బీజేపీ ప్రభుత్వంపై పడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్వాకం అంటూ విపక్షాలు విమర్శించాడనికి అవకాశం చిక్కింది. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన అనేకఎక్స్ ప్రెస్ వేలు… ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని స్ట్రాంగ్‌గా నిలబడ్డాయని ఫోటోలుపెడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close