గోరంట్ల వీడియోపై కాదు టీడీపీ ఫోరెన్సిక్ రిపోర్టుపై సీఐడీ విచారణ !

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను సమర్థించేందుకు చివరికి ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగింది. ప్రభుత్వం ఆ వీడియోను ఫోరెన్సిక్ టెస్ట్ చేయించేది లేదని తేల్చేయడంతో టీడీపీ నేతలు అమెరికాలోని ఎక్లిప్స్ అనే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించింది. ఆ టెస్ట్ ల్యాబ్‌ విషయంలో ఎవరు ఫిర్యాదు చేశారో స్పష్టత లేదు కానీ ఏకంగా సీఐడీనే రంగంలోకి దిగింది. సీఐడీ అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వివరణ తీసుకున్నామని.. ఆ వీడియో ఒరిజినల్ అని తాము చెప్పలేదని ఆ ల్యాబ్ చెప్పలేదని సీఐడీ డీజీ సునీల్ కుమారే మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. పైగా తాము రిపోర్టు ఇవ్వక ముందే అందులో మార్పులు చేశారని ల్యాబ్ చెప్పిందని కూడా సునీల్ కుమార్ చెబుతున్నారు.

రిపోర్ట్ ఇచ్చేటప్పుడే మార్పులు చేయాలని కోరారన్నారు.రిపోర్ట్ ఇవ్వక ముందే ఎలా మార్పులు చేస్తారో కానీ.. ఎక్స్ పర్ట్ రిపోర్టులో మార్పులు చేసినందున ఆ రిపోర్టు చెల్లదని చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఎక్లిఫ్స్ ఇచ్చిన రిపోర్టులో మార్ఫింగ్ చేసినందున ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని బెదిరించారు సునీల్ కుమార్. అసలు ఆ వీడియో ఇద్దరి మధ్య జరిగిందని.. మూడో వ్యక్తి రికార్డు చేశాడన్నారు. ఇద్దరి మధ్య జరిగిన రికార్డింగ్‌ ఒరిజినల్ అవుతుంది కానీ.. మూడో వ్యక్తి రికార్డు చేసేది ఒరిజినల్ కాదన్నారు. సునీల్ కుమార్ స్వయంగా మీడియా ముందుకు రావడంతో టీడీపీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.

అసలు ఆ వీడియోను ఫోరెన్సిక్ టెస్ట్ చేయించకుండా… టీడీపీ వాళ్లు చేయిస్తే ఫేక్ అని వాదించడానికి నేరుగా సీఐడీ డీజీనే రంగంలోకి దిగారు. కానీ వారుచెప్పే ఆ ఒరిజినల్ వీడయో ఎక్కడుందో చూసి నిజమో కాదో తేల్చేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. గోరంట్ల మాధవ్ వీడియో మార్పింగ్ అని కానీ ఫేక్ అని కానీ ఒక్కరూ నమ్మట్లేదు. ఎందుకంటే… గ్రాఫిక్స్‌కు..నిజానికి తేడా తెలుసుకోలేనంత అమాయకండా ఈ డిజిటల్ ప్రపంచంలో జనంలేరు. కానీ అది ఫేక్ అని నమ్మించాలని ప్రయత్నం చేస్తూ.. పదేపదే వ్యవస్థల విశ్వసనీయతను.. ప్రభుత్వమే దిగజార్చుతూండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close