లోటు 77వేల కోట్లు – అయినా అప్పులిస్తున్న కేంద్రం !

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఏపీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.45 వేల కోట్ల వరకూ ఉంటే ఖర్చులు మాత్రం ఏకంగా రూ. లక్షా 24 వేల కోట్లుగా తేలింది. అంటే 75 వేల కోట్లకుపైగా లోటు. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడమో.. బకాయిలు పెట్టడమో చేశారన్నమాట. ఈ నెలలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ప్రభుత్వం సాగుతోంది. ఓ దశలో ఓడీ రూ.2,975 కోట్లకు చేరిపోయింది. నాలుగో తేదీన రూ.2 వేలకోట్లు అప్పు తీసుకుని ఓడీకి జమ చేశారు. మళ్లీ ఓడీ కింద అప్పు చేశారు. అయినా కొంతమందికి జీతాలు, పెన్షన్లు అందించలేకపోయారు.

అయితే కేంద్రం మాత్రం అడిగినన్ని అప్పులకు పర్మిషన్ ఇస్తూండటంతో ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా పోతోంది. ఏడాది మొత్తం తీసుకోవాల్సిన అప్పుల పరిమితి ముగిసిపోయింది. అయినా ఏదో కారణంతో అప్పులు ఇస్తూనే ఉంది. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై నిఘా పెట్టినట్లుగా మాత్రం లీకులు ఇస్తోంది. తాజాగా కేంద్రం ఆర్థికశాఖకు ఓ లేఖ పంపిందని.. ఆర్థిక నిర్వహణపై పూర్తి స్థాయి సమాచారం కోరారన్న ప్రచారం జరుగుతోంది.

కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు, ఆస్తుల కల్పనకు తీసుకుంటున్న చర్యలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల నిధుల వివరాలు, కేంద్ర పథకాల నిర్వహణ, వాటికి కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర వాటా నిధులు, ఈ పథకాలను నిర్వహిస్తున్న ప్రభుత్వ సంస్థల వివరాలు చెప్పాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి ఆదేశాలు కేంద్రం చాలా సార్లు ఇచ్చింది. రాష్ట్రం చెప్పింది లేదు.. కంద్రం .. పట్టించుకున్నదీ లేదు. అటు కేంద్రం..ఇటు రాష్ట్రం తాము నిబంధనల ప్రకారం వెళ్తున్నామని కవరింగ్ చేసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా ఉన్నాయని ఆర్థిక నిపుణుల భావన.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close