మ‌ళ్లీ కెల‌క‌డం ఎందుకు చిరూ…?

మానిన గాయాన్ని మ‌ళ్లీ రేప‌కూడ‌దు. అది ఏ స్థాయిలో ఉన్న‌వారికైనా మంచిది కాదు. చిరంజీవికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. అల‌య్ బ‌లాయ్ కార్యక్ర‌మంలో చిరు – గ‌రిక‌పాటి ఎపిసోడ్ గురించి అంద‌రికీ తెలిసిందే. వారం రోజుల పాటు మీడియాకు ఇది ముడిస‌రుకు అయిపోయింది. గ‌రిక‌పాటిని మెగా ఫ్యాన్స్ చెడుగుడు ఆడేసుకొన్నారు. నాగబాబు నుంచి వ‌ర్మ వ‌రకూ అంద‌రూ దిగిపోయి…. గ‌రిక‌పాటిపై విరుచుకుప‌డ్డారు. `ఆ పెద్దాయ‌న్ని అలా వ‌దిలేయండ్రా..` అన్నా ఎవ‌రూ విన‌లేదు. కాల మ‌హిమ‌…గ‌రిక‌పాటి ఎపిసోడ్ ని కాల‌మే మ‌ర్చిపోయేలా చేసింది. దాన్ని ఇప్పుడు చిరు మ‌ళ్లీ కెలికారు.

శుక్ర‌వారం ఓ పుస్త‌క ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. స‌భ ముగుస్తున్న త‌రుణంలో… మ‌హిళ‌లంతా చిరుని చుట్టిముట్టారు.. ఫొటోల కోసం. ఆ స‌మ‌యంలో… చిరు `ఇక్క‌డ వారు లేరు క‌దా..` అంటూ గ‌రిక‌పాటిని గుర్తు చేశారు. దాంతో స‌భికులు ఘొల్లు మ‌న్నారు. చిరు స‌మ‌య‌స్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే. అందులో మరో మాట లేదు.కాక‌పోతే…. గ‌రిక‌పాటి ఎపిసోడ్ ని అంద‌రూ మ‌ర్చిపోయినా `నేను మ‌ర్చిపోలేదు` అన్న‌ట్టు మారింది చిరు వెట‌కారం. ఇప్పుడు మ‌రి కొద్దిరోజులు గ‌రిక‌పాటి వార్త‌ల్లో ఉంటారు. మ‌ళ్లీ మెగాఫ్యాన్స్ అందుకోవ‌డం మొద‌లెడ‌తారు. ఇదంతా ఇప్పుడు మ‌ళ్లీ అవ‌స‌ర‌మా చిరూ…? అల‌య్ బ‌లాయ్ వేదిక‌పై ఎంత హుందాగా ఉన్నావో.. ఇప్పుడూ అలానే ఉంటే స‌రిపోయేదిగా..?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ 30 ఫీట్ ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే !

తాడేపల్లిలోని జగన్ ఇల్లు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుది.. రెండు ఎకరాల చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే. వ్యూ కట్టర్స్ పేరుతో...

ప్రైవేట్ సైన్యం…జగన్ కు ఎందుకంత భయం..!!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం హాట్...

రీఎంట్రీకి శిశికళ రెడీ !

తమిళనాట స్టాలిన్‌కు పోటీ ఎవరు అన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. అన్నామలైకు తమిళనాడులో తప్ప బయట కావాల్సినంత హైప్ వస్తోంంది. తమిళనాడులో పట్టించుకునేవారు లేరు. పన్నీరు సెల్వం,...
video

కల్కి.. సమయం చూడని సమరం

https://www.youtube.com/watch?v=5UfGZFrXKig మూడు సార్లు వాయిదా పడ్డ ‘కల్కి 2898 ఎ.డి’ భైరవ పాట ఎట్టకేలకు విడుదలైయింది. సంతోష్ నారాయణ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి, కుమార్‌ రచించిన ఈ పాట... దిల్జీత్‌ దోసాంజ్, దీపక్‌ బ్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close