ఖుషి ఆడియో @ రూ.13 కోట్లు

విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అయితే ఈ ప్రాజెక్టుపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. బిజినెస్ ప‌రంగానూ క్రేజ్ సంపాదించుకొంది. షూటింగ్ స‌గం కూడా పూర్త‌వ్వ‌లేదు. ఈ సినిమా నుంచి ఒక్క పాట కూడా బ‌య‌ట‌కు రాలేదు. అప్పుడే ఆడియో రైట్స్ అమ్ముడుపోయాయి. స‌రిగ‌మ సంస్థ ఖుషి ఆడియోని రూ.13 కోట్ల‌కు సొంతం చేసుకొంది. మ‌ల‌యాళ `హృద‌యం` చిత్రానికి ప‌ని చేసిన అబ్దుల్ వాహెద్‌.. తొలిసారి `ఖుషి`తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. `హృద‌యం`లో పాట‌ల‌న్నీ హిట్టే. ఖుషి ల‌వ్ స్టోరీ కాబ‌ట్టి పాట‌ల‌కు మంచి స్కోప్ ఉంది. దానికి తోడు `లైగ‌ర్` హిందీ వెర్ష‌న్ పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్‌. `ఖుషి` ఎలాగూ పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి… అన్ని భాష‌ల్లోనూ ఈ పాట‌ల‌కు మంచి మైలేజీ ఉంటుంది. విజ‌య్ – స‌మంత – శివ నిర్వాణ – మైత్రీ మూవీస్ ఇలా… కాంబినేష‌న్ ప‌రంగానూ ఈ ప్రాజెక్టుకి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఒక్క పాట కూడా రాకుండానే ఆడియో రైట్స్ అమ్ముడుపోయాయి. నిజానికి అన్ని ఆడియో సంస్థ‌లూ.. ఖుషి రైట్స్ కోసం పోటీ ప‌డ్డాయి. ఆక్ష‌న్ ప‌ద్ధ‌తిలో ఎక్కువ మొత్తానికి పాడుకొన్న స‌రిగ‌మ‌… చివ‌రికి ఖుషి రైట్స్ ద‌క్కించుకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close