‘ఆహా’.. ఆఫ‌ర్‌… సీరియ‌ల్ ఫ్రీ!

తెలుగులో తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా మెల్ల‌మెల్ల‌గా పుంజుకొంటోంది. ముఖ్యంగా ‘అన్ స్టాప‌బుల్‌’తో ఆహాకి మైలేజీ బాగా పెరిగింది. దాన్ని కాపాడుకోవ‌డానికి మ‌రింత తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తోంది. అనిల్ రావిపూడితో ఓ కామెడీ షో ప్లాన్ చేసిన ఆహా.. కొత్త సినిమాలు, వినోద కార్య‌క్ర‌మాల‌తో స్పీడు పెంచింది. ఇప్పుడు సీరియ‌ల్స్ నికూడా రంగంలోకి దింపుతోంది. అది కూడా ఫ్రీగా చూసే వెసులు బాటుతో. ‘మిస్ట‌ర్ పెళ్లాం’ అనే ధారావాహిక‌ను న‌వంబ‌రు 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌కి ఉంచారు. ఇదో కామెడీ నేప‌థ్యంలో డైలీ సీరియ‌ల్‌. ప్ర‌తీరోజూ ఈ సీరియ‌ల్‌ని ఫ్రీగా చూసే వెసులుబాటు క‌ల్పించారు. ఓటీటీలో యువ‌త ప్రాబ‌ల్య‌మే ఎక్కువ‌. వాళ్లు సీరియ‌ల్స్ కి పెద్ద‌గా క‌నెక్ట్ అవ్వ‌రు. సీరియ‌ల్స్ ల‌క్ష్యం కుటుంబ ప్రేక్ష‌కులే. అలానే.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి ఆహాకి క‌నెక్ట్ చేయ‌డానికి చేస్తున్న పైలెట్ ప్రాజెక్ట్ ఇది. దీనికి గ‌నుక వ్యూస్ బాగుంటే.. ఇలాంటి ప్రాజెక్టులు మ‌రిన్ని చేప‌ట్టాల‌ని ఆహా భావిస్తోంది.
ఓటీటీలో సీరియల్స్ కి చోటివ్వ‌డం కొత్త సంప్ర‌దాయ‌మైతే… దాన్ని ఉచితంగా అందించ‌డం మ‌రో కొత్త ర‌క‌మైన ఎత్తుగ‌డ‌. మ‌రి ఈ వ్యూహం ఆహాకి ఎంత వర‌కూ ప్ల‌స్ అవుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close