అప్పట్లో వైఎస్ కుయ్.. కుయ్ – ఇప్పుడు కేసీఆర్ టింగ్..టింగ్ !

రాజకీయ నేతలు ప్రజల్ని ఆకట్టుకోవడానికి చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు ఎక్కువగా భాషా ప్రయోగాల్లోనే ఉంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి గెలవడానికి చేసిన కొన్ని ప్రచార ట్రిక్కుల్లో తాను 108 అంబులెన్స్‌లు తెచ్చానని చెప్పుకునేందుకు .. ఫోన్ చేస్తే.. కుయ్.. కుయ్ అని అంబులెన్స్ వస్తుందని.. విచిత్రంగా సౌండ్స్ చేస్తూ చెప్పేవారు. అది ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే కేసీఆర్ చేశారు. రైతు బంధు నిధులు పది రోజుల్లో వస్తాయని చెప్పడానికి ఆయన చేసిన పద ప్రయోగం హైలెట్ అవుతోంది.

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్.. అక్కడ బహిరంగసభలో మాట్లాడారు. అందులో రైతు బంధు నిధులు.. మరో వారం, పది రోజుల్లో ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. అయితే సాదాసీదాగా చెప్పలేదు… తనదైన శైలిలో చెప్పారు. ” రైతుబంధు వస్తది? ఇంకో ఐదు పది రోజుల్లో రైతుబంధు పడుతుంది? పడాలి కదా? ఎట్ల పడుతది.. బ్యాంకుల్లో పడంగనే టింగుటింగుమని ఫోన్‌కు మెస్సేజ్‌ వస్తది’ అని హావభావాలతో చెప్పారు. రైతు బంధు నిధులు ఇటీవలి కాలంలో ఆలస్యమవుతున్నాయి. ఎప్పుడు వస్తాయో లేదో తెలియడం లేదు. ఈ సీజన్‌కు నవంబర్‌లోనే ఇవ్వాల్సి ఉంది. కానీ డిసెంబర్ కు వచ్చినా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ కేసీఆర్ మాత్రం ఐదు.. పది రోజులని క్లారిటీ ఇచ్చారు.

జగిత్యాల సభలో కేసీఆర్ తాను ప్రజలకు ఏం చేశానో చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో కేంద్రంపైనా విరుచుకుపడ్డారు. కానీ మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రస్తావించలేదు. తాను సీఎం అయినప్పుడే మోదీ ప్రధాని అయిండని.. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో తేల్చుకుందామని చర్చకు రావాలని సవాల్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close