పత్రికా సమావేశంలో మాట్లాడటం కూడా ఒక కళ. విలేఖరులు రకరకాల ప్రశ్నలు సంధిస్తారు. కానీ మాట్లాడే సెలబ్రిటీ మాత్రం సబ్జెక్ట్ కి కట్టుబడే మాట్లాడాలి. ఇలా సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడటం కూడా ఒక అనుభవంతోనే వస్తుంది. అయితే హీరోయిన్ శ్రీలీల మాత్రం ఈ కళని త్వరగా నేర్చుసుకుంది. ఈ రోజు ‘ధమాకా’ సినిమా కోసం విలేఖరుల సమావేశం పాల్గొంది శ్రీలీల. ధమాకా సినిమా గురించి తప్పితే అదనంగా మరో టాపిక్ గురించి మాట్లాడలేదు. వేరే ప్రశ్నలు వేసినా.. చాలా సున్నితంగా ‘ఇది ధమాకా ప్రమోషన్ కదా’ అని నవ్వేసింది.
బాలకృష్ణ-అనిల్ రావిపూడి సినిమాలో చేస్తోంది శ్రీలీల. ఈ సినిమా గురించి ఏమైనా కబుర్లు చెప్పని అడిగితే.. మొన్న స్టార్ట్ చేశారని నవ్వేసింది. అంతేకాదు… ఇంకా అధికారికంగా ప్రకటన రాని తన సినిమాల గురించి కనీసం ప్రస్థావించలేదు. నిర్మాతలు చెబితేనే బావుంటుందని సెలవిచ్చింది. ప్రతిమాట కూడా చాలా ఆచితూచి మాట్లాడింది. శ్రీలీల ఇంటర్వ్యూ ఇచ్చిన విధానం చూస్తే బ్యూటీ విత్ బ్రెయిన్ అనే మాట గుర్తుకు వస్తుంది.
ధమాక తర్వాత బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమా, అలాగే బోయపాటి-రామ్ కాంబోలో ఒక మూవీ, వైష్ణవ్ తేజ్, నితిన్, వారాహి ప్రొడక్షన్లో ఇలా వేర్వేరు ప్రాజెక్టులకు ఓకే చెప్పింది శ్రీలీల.