కేసీఆర్‌పై గవర్నర్‌దే పైచేయి !

గవర్నర్‌పై ఆవేశంగా హైకోర్టుకెళ్లిన తెలంగాణ సర్కార్ చివరికి ఆవేశం కాదు.. ఆలోచన ఉండాలని తెలుసుకుది. ఇంత కాలం గవర్నర్ విషయంలో చేస్తున్నదంతా తప్పు అని ఒప్పుకోవాల్సి వచ్చినట్లయింది. హైకోర్టులో వేసిన అత్యవసర పిటిషన్ ను ఉపసంహరించుకుని గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు చెప్పాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ మాత్రం ఊహించలేని ఘటనలు ఈ ఉదయం నుంచి వరుసగా జరిగిపోయాయి.

మూడో తేదీన అసెంబ్లీని సమావేశపరిచి.. అదే రోజు బడ్జెట్ పెట్టాలనుకున్న ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది. కానీ గవర్నర్ .. మాత్రం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదని తిరుగు ప్రశ్నతో లేఖ పంపారు. దీంతో బడ్జెట్ ఆమోదించరని డిసైడయి.. కోర్టులో పిటిషన్ వేసింది ప్రభుత్వం. నిజానికి ఇది హైకోర్టు విచారించే విషయం కాదు. గవర్నర్ ను హైకోర్టు ఆదేశించలేదు. అలాగే.. గవర్నర్ ప్రసంగం పెట్టాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించలేదు. అయినప్పటికీ ఏ న్యాయసలహాదారుడు సలహా ఇచ్చారో కానీ తెలంగాణ సర్కార్ హైకోర్టుకు వెళ్లింది.

పిటిషన్ పరిశీలన స్థాయిలోనే ఈ పిటిషన్ ను ఎలా విచారించగలమని.. హైకోర్టు ప్రశఅనిస్తే.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు కలగజేసుకోవచ్చునని ప్రభుత్వం తరపు లాయర్ దుష్యంత్ దవే చెప్పకొచ్చారు. దీంతో హైకోర్టు అనమతించిది. కానీ వాదనల్లో అసలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ప్రభుత్వమేనన్నట్లుగా తేలే సూచనలు కనిపించడంతో .. అది మరీ డేంజర్ కావడంతో వెంటనే వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. పిటిషన్ వెనక్కి తీసుకుంటామని.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని హైకోర్టుకు దవే తెలిపారు.అంతే కాదు గవర్నర్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వానికి సూచిస్తానన్నార.ు

ప్రభుత్వం ఒక్క సారిగా గవర్నర్ కు సరెండర్ అయినట్లుగా వ్యవహిరంచడంతో బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఇంత దానికి హైకోర్టు దాకా ఎందుకు వెళ్లడం అని.. ముందే … గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెబితే.. ఇక్కడిదాకా సమస్య వచ్చేది కాదు కదా అన్న నిట్టూర్పు వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిన్నెల్లి ఎపిసోడ్ తో ఇబ్బందుల్లో ఈసీ.!!

పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఎన్నికల కమిషన్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల...

మ‌రో మెగాహీరోని ప‌ట్టిన ‘ప‌లాస‌’ ద‌ర్శ‌కుడు

'ప‌లాస‌'తో త‌న మార్క్ చూపించిన ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్‌. ఆ త‌ర‌వాత వ‌చ్చిన 'శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌' జ‌స్ట్ 'ఓకే' అనిపించుకొంది. ఇప్పుడు వ‌రుణ్‌తేజ్ తో 'మ‌ట్కా' తెర‌కెక్కిస్తున్నాడు. ఈలోగా మ‌రో మెగా హీరోని...

కేటీఆర్ కు రైతులు గుర్తుకొచ్చారు…అయినా నమ్మేస్తారా..?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రైతుల కష్టాలు పదేళ్ల తర్వాత గుర్తుకొచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో రైతుల సమస్యలపై ఏనాడూ స్పందించని కేటీఆర్ తాజాగా జోగిపేటలో విత్తనాల కోసం రైతులు...

పిన్నెల్లి అరెస్టుకు సీఈసీ డెడ్ లైన్ !

మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత చేసినా కేసు కూడా నమోదు చేయకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని సీఈసీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close