బీజేపీలో చేరలేదనే కవితను అరెస్ట్ చేస్తున్నారన్న కేసీఆర్ !

బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారని.. కవితను కూడా చేరమన్నారని…. మహా అయితే ఏం చే స్తారు.. జైలుకు పంపుతారు అంతే కదా అని కేసీఆర్ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. కార్యవర్గ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ కవిత ఈడీ కేసుల అంశంపై చర్చించారు. శనివారం కవితను అరెస్ట్‌ చేయొచ్చునని… చేసుకుంటే చేసుకోని అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా తెలు్సతోంది. అందర్నీ వేధిస్తున్నారు.. భయపడేది లేదు.. పోరాటం వదిలేది లేదు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని పార్టీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గంగుల, రవిచంద్ర.. ఇప్పుడు కవిత వరకు వచ్చారు.. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తారు.. ప్రజల కోసం కడుపు కట్టుకుని పనిచేయాలని సూచించారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఆలోచనే లేదని సీఎం కేసీఆర్ పార్టీ కార్యవర్గసభ్యులకు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు సమావేశాలు పెట్టుకుని పాదయాత్రలు చేయాలని సూచించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపడుతోందని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కవితను అరెస్ట్ చేస్తే .. ఎలాంటి నిరసనలు చేయాలో కూడా కార్యవర్గ సమవేశంలో సూచించినట్లుగా తెలుస్తోంది.

మరో వైపు కవిత శనివారం ఉదయం ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులోనూ ఈడీ కవిత పేరును పలుమార్లు ప్రస్తావించింది. 32.5 శాతం వాటాకా సౌత్ గ్రూప్ లో కవితకు ఉందని.. పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో..కవిత సోదరుడు కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. శనివారం ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close