ఫిరాయించిన ఆ నలుగురిపై అనర్హతా వేటుకు టైం?

తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఆ నలుగురికి కూడా టీడీపీ విప్ జారీ చేసింది. ఏపీ ఎమెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నిలబెట్టిన అభ్యర్థి పంచుమర్తి అనూరాధకు ఓటు వేయాలని మద్దాలి గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లిలకు కూడా విప్ జారీ చేశారు. ఇప్పుడు వీరు తప్పని సరిగా ఓటింగ్ లో పాల్గొని.. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. వేయకపోయినా గైర్హాజర్ అయినా టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తుంది. ఇది విప్ ఉల్లంగన వ్యవహారం కాబట్టి స్పీకర్ కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఏడు స్థానాలకు ఈ నెల 23న మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ తరపున పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులు ఉన్నారు. ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఏడుగురు ఎమ్మెల్సీలు అవుతారు. వైఎస్ఆర్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ బలంతో ఆరుగురు మాత్రం గెలవగలరు. కానీ ఏడో సీటు కోసం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఓటు వేస్తే గెలుస్తుంది.

అలాగే వైసీపీ నుంచి ధిక్కరించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని చెబుతున్నారు. అయితేవారికి కూడా వైసీపీ విప్ జారీ చేస్తుంది. అదే జరిగితే వారి పార్టీకి ఓటు వేయకపోతే వారిపైనా అనర్హతా వేటు పడుతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close