ఆన్‌లైన్‌కి ఎక్కిన మంచు బ్రదర్స్ గొడవలు !

మంచు మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయని అంతర్గతంగా జరుగుతున్న ప్రచారం నిజమేనని మంచు మనోజ్ బయట పెట్టారు . తన దగ్గర పని చేసే ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి మరీ తన సోదరుడు విష్ణు దాడి చేశారంటూ ఓ వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోల ఓ మధ్యతరగతి ఇంట్లోకి చొరబడిన విష్ణు వారిపై దౌర్జన్యం చేస్తున్నట్లుగా ఉంది.

విష్ణు దాడి చేస్తున్న వ్యక్తి సారధి అని.. అతను మంచు కుటుంబం వద్ద చాలా కాలంగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతను విష్ణు కన్నా మనోజ్ కు దగ్గరగా ఉంటారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏదో విషయంలో తేడా జరగడంలో ఇలా ఇళ్లకు వెళ్లి విష్ణు గొడవ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విష్ణు తరచూ ఇలా ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేస్తున్నారని మనోజ్ ఆరోపిస్తున్నారు. దీనికి కారణం ఏమిటన్నది మాత్రం మనోజ్ బయట పెట్టలేదు.

మంచు సోదరులు ఇద్దరూ తమ గొడవల్ని ఇలా ఆన్ లైన్ చేసుకోవడంతో… ఇప్పుడు ఈ వ్యవహారం అంతా రచ్చ రచ్చ అవుతోంది. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న మనోజ్ … చాలా కాలం నుంచి కుటుంబంతో విడిగానే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. మరి మనోజ్, విష్ణు మధ్య గొడవలేమిటో కానీ.. ఆ కుటుంబం పరువు మాత్రం ఆన్ లైన్ కు ఎక్కింది. ఇలాంటి వీడియోల కోసం ఎదురు చూసే మీడియా. సోషల్ మీడియా పండగ చేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close