సెకండాఫ్ మార్చేసిన విశ్వ‌క్‌

విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం దాస్ కా ధ‌మ్కీ. ఈ చిత్రానికి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ అందించాడు. త‌ను ఇప్పుడు ఓ కాస్ట్లీ రైట‌ర్‌. ధ‌మాకా చిత్రానికీ త‌నే క‌థ‌, మాట‌లు ఇచ్చారు. ఒక్కో ప్రాజెక్టుకి క‌నీసం కోటి రూపాయ‌లు ఛార్జ్ చేస్తాడ‌ని టాక్. అంత ఖ‌రీదైన ర‌చ‌యిత‌. త‌ను క‌థ అందించిన‌ప్ప‌టికీ… విశ్వ‌క్ చేయి చేసుకోక త‌ప్ప‌లేద‌ట‌. ధ‌మ్కీ ని ఓ క‌థగా రాసి, పూర్తి స్థాయి స్క్రిప్టుని విశ్వ‌క్ చేతుల్లో పెట్టేశాడు. ఆ త‌ర‌వాత‌.. ప్ర‌స‌న్న‌కుమార్ క‌థ‌లో గానీ, స్క్రిప్టు మార్పులు, చేర్పుల‌లో గానీ ఎలాంటి జోక్యం చేసుకోలేదు. అయితే.. సెకండాఫ్‌లో విశ్వ‌క్ కీల‌క‌మైన మార్పులు చేశాడు. ముఖ్యంగా రెండో పాత్ర‌ని `సైకో`గా తీర్చిదిద్దడం, దాన్ని ఓ థ్రిల్ల‌ర్‌గా మార్చ‌డం వెనుక‌… విశ్వ‌క్ హ‌స్తం ఉంది. ప్ర‌స‌న్న‌కుమార్ సెకండాఫ్‌ని సైతం జోవియ‌ల్‌గా రాసుకొన్నాడ‌ట‌. అక్క‌డా ఫ‌న్ వ‌ర్క‌వుట్ అయ్యేట్టు చూశాడు.కానీ.. ఫ‌న్ గా ఈ క‌థ‌ని న‌డిపితే రెగ్యుల‌ర్ అయిపోతుంద‌ని భావించిన విశ్వ‌క్‌.. దీనికో థ్రిల్ల‌ర్ కోటింగు ఇవ్వాల‌ని చూశాడు. అందుకే క‌థ‌లో ట్విస్టులు వ‌చ్చి ప‌డిపోయాయి. సినిమా చూసిన‌వాళ్లు.. ఫ‌స్ట్ హాఫ్ ఓ సినిమా, సెకండాఫ్ మ‌రో సినిమా చూసిన‌ట్టు ఉంద‌ని చెబుతున్నారు. సాక్ష్యాత్తూ విశ్వ‌క్ సేనే `ఒక టికెట్టుపై రెండు సినిమాలు` అంటూ ప్రెస్ మీట్ల సాక్షిగా చెప్పాడు. దాని అర్థం ఇదే. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమాకి మంచి క‌ల‌క్ష‌న్లే వ‌స్తున్నాయి. కాక‌పోతే.. విమ‌ర్శ‌కులు, విశ్లేష‌కులు ఇదో సాదీ సీదా సినిమా అని తేల్చేశారు. ట్విస్టుల కోసం క‌థ‌ని ఖూనీ చేశార‌ని అంటున్నారు. ప్ర‌స‌న్న‌కుమార్ రాసిన స్క్రిప్టు రాసిన‌ట్టు తీస్తే.. ఫ‌లితం మ‌రోలా ఉండేదేమో..? మొత్తానికి కోటి రూపాయ‌లు పెట్టుకొన్న క‌థ‌.. అందులో స‌గ‌మే వాడుకొన్నాడు విశ్వ‌క్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: టక్కర్

Takkar Movie Review తెలుగు360 రేటింగ్ : 2/5 సిద్ధార్థ్ ప్రతిభ గల నటుడు. ఆయనకి విజయాలు కూడా వచ్చాయి.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగులో చాలా క్రేజీ ని తెచ్చుకున్నాడు. ఐతే విజయాలని కొనసాగించడంలో...

మీడియా వాచ్ : బ్యాన్ చేసి ఏబీఎన్‌ క్రేజ్ పెంచేసిన జగన్ !

ఏబీఎన్ చానల్ కు జగన్ ఎంత మేలు చేశారంటే.. ఇప్పుడా చానల్ యూ ట్యూబ్ లో జాతీయ.స్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో ఆ చానల్ రాకుండా చేశారు. డిష్‌లలో వస్తుంది. కానీ...

లిక్కర్ స్కాంలో కవితపై ఆధారాలున్నాయన్న కోర్టు !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు అనూహ్యమైన షాక్ తగిలింది. నేరుగా కోర్టే ప్రాథమిక అదారాలు ఉన్నాయని వ్యాక్యానించింది. ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐ ఆరోపణలు చేసింది. కానీ న్యాయమూర్తి ఆధారాలున్నాయని...

వారాహియాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన !

ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా జనంలోనే ఉండేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. పద్నాలుగో తేదీన వారాహి యాత్రను ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల ముందే అమరావతి చేరుకుని హోమాలు చేయనున్నారు. ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close