సుహాస్‌కి ఇంత డిమాండా..?

చిన్న చిన్న సినిమాల్లో, చిన్న చిన్న పాత్ర‌ల‌తో ఎదిగాడు సుహాస్‌. యూ ట్యూబ్ నుంచి.. వెండి తెర‌కి ప్ర‌మోష‌న్ తెచ్చుకొన్నాడు. హీరో అయ్యాడు. క‌ల‌ర్ ఫొటోతో త‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర‌వాత వెబ్ మూవీస్‌, వెబ్ సిరీస్‌లూ చేశాడు. ఇటీవ‌ల రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ గా అవ‌తారం ఎత్తాడు. ఈ సినిమా డివైడ్‌టాక్ తెచ్చుకొంది. అయితే… నిర్మాత‌ల‌కు మాత్రం లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో.. సుహాస్ డిమాండ్ విప‌రీతంగా పెరిగిపోయింది.చిన్న సినిమాల‌కు తాను కేరాఫ్ అయ్యాడు. విచిత్రంగా అగ్ర నిర్మాణ సంస్థ‌లు కూడా త‌న‌తో సినిమాలు చేయ‌డానికి ముందుకొస్తున్నాయి. సుహాస్ పారితోషికం ఇప్పుడు అక్ష‌రాలా రూ.2 కోట్లు. అంత ఇవ్వ‌డానికి నిర్మాత‌లు సిద్దంగా ఉన్నా, సుహాస్ కాల్షీట్లు మాత్రం అందుబాటులో లేవు. దిల్ రాజు సుహాస్ తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు. ఆయ‌న సుహాస్ కోసం ఓ క‌థ రెడీ చేశారు. అయితే సాక్ష్యాత్తూ దిల్ రాజు సినిమా చేయ‌డానికి సుహాస్ ద‌గ్గ‌ర డేట్లు లేవ‌ట‌. అదీ.. ఇప్పుడు సుహాస్ డిమాండ్. త‌న సినిమాలు రెండు సెట్స్ మీద ఉన్నాయి. మ‌రో మూడు సినిమాలు సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రెడీగా ఉన్నాయి. అందుకే.. సుహాస్ ఇప్పుడు కొత్త సినిమాల‌కు, కొత్త క‌థ‌ల‌కు కాల్షీట్లు కేటాయించ‌లేక‌పోతున్నాడు. సుహాస్ క్రేజ్ చూసి, చిత్ర వ‌ర్గాలు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. ప‌రిశ్ర‌మ‌లో ఇంత వ‌ర‌కూ.. హీరోయిన్ల‌కే కొర‌త అనుకొనేవారు. ఇప్పుడు హీరోల‌కూ కొర‌తొచ్చింది. చిన్న‌, మీడియం సైజు బ‌డ్జెట్ చిత్రాల‌కు హీరోలు దొర‌క‌డం లేదు. అందుకే సుహాస్ లాంటి వాళ్లు సైతం య‌మ బిజీగా అయిపోతున్నార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close