ఇప్పుడు “మంత్రుల టిక్కెట్లు” చింపే ధైర్యం ఉందా !?

ముగ్గురు, నలుగురు టిక్కెట్లు చినిగిపోతాయని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలోనే మంత్రుల్ని హెచ్చరించారు. ఆ తర్వాతి రోజే ఎవరెవర్ని తీసేస్తారు.. ఎవరెవర్ని తీసుకుంటారు అనే లీకులు కూడా సజ్జల క్యాంప్ నుంచి వచ్చాయి. దీంతో ఎమ్మెల్సీల్లో కొత్త మంత్రులు ఉన్నారని వారికి శుభాకాంక్షలు ప్రారంభమయ్యాయి. ఊస్టింగ్ లిస్టులో పేరున్న మంత్రులపై జాలి చూపులు కూడా ఎదురయ్యాయి. అయితే ఆ కేబినెట్ సమావేశం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు వైసీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.

దీంతో సీఎం జగన్ ఇప్పుడు మంత్రులటిక్కెట్లు చింపడం కన్నా పెద్ద తప్పిదం మరొకటి ఉండదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పదే పదే మంత్రివర్గాన్ని మారుస్తున్నారని జనం అనుకోడంతో పాటు మంత్రి పదవులు రాని వారు.. తీసేసిన వారు చేసే రచ్చను తట్టుకోవడం కష్టమనే అంచనాకు వచ్చారు. ప్రస్తుతం గతంలోలా పరిస్థితులు లేవు. ఓ ఏడాది క్రితం జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు సగం మంది ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారని.. తమ రాజకీయ జీవితాల్ని నాశనం చేశారని అనుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఎమ్మెల్యేలం అనే మాటే కానీ.. కనీస గౌరవం రాలేదని వారు రగిలిపోతున్నారు.

అదే సమయంలో ప్రభుత్వ వ్యతరేకత ఉద్ధృతంగా ఉందని.. వేరే దారి చూసుకోవడం మంచిదన్న అభిప్రాయంలో ఎక్కువ మంది ఉన్నారని చెబుతున్నారు. అలాంటి పరిస్థితి ఉంటే మంత్రివర్గ మార్పు చేర్పులు అనేది పెద్ద బ్లండర్ అవుతుందని ఇప్పటికే వ్యూహకర్తలు భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ ఐ ప్యాక్ , సజ్జల మాయలో ఉన్నారని.. వారేం చెబితే అదే చేస్తారని అంటున్నారు. మొత్తంగా వారు కూడా ఇప్పుడు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ మంత్రుల టిక్కెట్లు చించే ధైర్యం సీఎం జగన్ చేయకపోవచ్చునని వైసీపీ వర్గాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close