రివ్యూ: మేమ్ ఫేమస్

Mem Famous Movie Review

తెలుగు360 రేటింగ్‌: 2.25/5

చిన్న సినిమా తీసినా దాన్ని తెలివిగా ప్రమోట్ చేయడం చాలా ముఖ్యం. ఈ విషయంలో చాయ్ బిస్కెట్ ముందు వరుసలో వుంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ గా మొదలైన చాయ్ బిస్కెట్ సంస్థ‌ ఇప్పుడు సినిమాలని నిర్మిస్తోంది. ఒక పక్క మేజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్త ట్యాలెంట్ ని ప్రోత్సహించే విధంగా రైటర్ పద్మభూషణ్.. ఇప్పుడు ‘మేమ్ ఫేమస్’ సినిమా నిర్మించింది. ‘రైటర్` కి ఏ విధంగా అయితే యూనిక్ ప్రమోషన్, మార్కెట్ చేశారో..మేమ్ ఫేమస్ ని కూడా అంతే డిఫరెంట్ గా జనాల్లోకి తీసుకొచ్చారు. ఇండస్ట్రీలోని స్టార్లని ప్రమోషన్స్ లో భాగం చేసి.. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్ర హీరోకు ప్రిమియర్ వేసి విడుదలకు ముందే ఒక పాజిటివ్ వైబ్ ని తీసుకొచ్చారు. అంతా కొత్తవాళ్ళు చేసి ఈ సినిమాకి చాలా చోట్ల ప్రిమియర్స్ పడ్డాయంటే కారణం… చాయ్ బిస్కెట్ నిర్మాతల ఆలోచనే. మరి ఇంత పాజిటివ్ బజ్ తో వచ్చిన మేమ్ ఫేమస్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? ఇందులో అంత ఫేమస్ కంటెంట్ ఏముంది ?

తెలంగాణలోని ఓ పల్లెటూరు బండనర్సపల్లి. మయి (సుమంత్ ప్రభాస్), దుర్గ (మణి ఏగుర్ల), బాలి (మౌర్య ) బాల్య స్నేహితులు. ఏ పనీపాట లేకుండా ఊర్లో ఆవారాగా తిరుగుతుంటారు. లేనిపోనీ పంచాయితీలు పెట్టుకోవడం, తాగడం, కోళ్ళు దొంగతనం చేసి వొండుకొని తినడం.. ఇలా సాగుతుంది వీళ్ళ దినచర్య. మయి మామ (మురళిధర్ గౌడ్) కూతురు మౌనిక(సౌర్య) తో ప్రేమలో ఉంటాడు. బాలికి కూడా ఓ ప్రేమకథ వుంటుంది. వూర్లో ఎందుకు పనికిరారు అనే ముద్ర వేసుకున్న ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఎలా ఫేమస్ అయ్యారు? వాళ్ళ ప్రేమకథలు ఫలించాయా ? లేదా? అనేది మిగతా కథ.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అంటే.. ఆలోచన యూత్ ఫుల్ గా వుండాలి. కథ యూత్ ఫుల్ గా వుండాలి. కథనం ఉడుకు రక్తంతో పరుగులెత్తాలి. అలాకాకుండా నూనూగు మీసాలున్న ఓ నలుగురు కుర్రాళ్ళని ఒక చోట చేర్చి వాళ్ళ దినచర్యని చిత్రీకరించడమే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అనుకుంటే మాత్రం పొరపాటే. ‘మేమ్ ఫేమస్’ చూస్తున్నప్పుడు ఇదే అభిప్రాయం కలుగుతుంది.

ఆవారాగా తిరుగుతూ యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిపోయిన ఓ ముగ్గురు కుర్రాళ్ళ కథ ఇది. ఈ లాగ్ లైన్ వున్న ‘యూట్యూబ్ ‘అనే మాటకు తగ్గట్టే ఈ సినిమా కంటెంట్ వుంది. రాత, తీతా… ఒక వెబ్ మూవీ చూసిన ఫీలింగ్ కూడా కలిగించవు. క్రికెట్ మ్యాచ్ లో ముగ్గురు స్నేహితుల్ని పరిచయం చేసిన సన్నివేశం కథ మొదలౌతుంది. ఈ ముగ్గురు దేనికీ పనిరారు అనే ఫీలింగ్ ని ఎస్టాబ్లెస్ చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. నిజానికి అంత లాగ్ అనవసరం. ఇందులో రెండు ప్రేమకథలు కనిపిస్తాయి. అయితే అందులో కూడా పెద్ద ఫీల్ వుండదు.

ఇలాంటి పనికిరాని పాత్రలన్నీ సెకండ్ హాఫ్ హీరోలుగా మారిపోతుంటాయి. మేమ్ ఫేమస్ లోవెరైటీ ఏమిటంటే.. ఫస్ట్ హాఫ్ లోనే ఆ ముగ్గురు కుర్రాళ్ళు మారిపోతారు. ఫేమస్ టెంట్ హౌస్ పెడతారు. పర్లేదు.. కథలోకి త్వరగానే వెళ్ళిపోయారని ఫీలింగ్ కలిగేలోపే.. మరో మలుపు వస్తుంది. టెంట్ హౌస్ కాలిపోతుంది. ఇంటర్వెల్ పడుతుంది. ఇంకేదో చేసి ఫేమస్ అవుతారు.. దాని కోసం మళ్ళీ సెకండ్ హాఫ్ చూడాలా ? అనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో వుంటుంది తప్పితే.. ఏం చేస్తారో అనే క్యురియాసిటీ కలగదు. దీనికి కారణం.. అప్పటికే బండనర్సపల్లి, ఆ పాత్రలపై ఒక ఐడియా వచ్చేస్తుంది. వీళ్ళ షార్ట్ ఫిల్మ్ మెంటాలిటీతో ఇంత కంటే ఏం అద్భుతాలు చేస్తారులే అనే అభిప్రాయం ప్రేక్షకుల మ‌న‌సుల్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది.

సెకండ్ హాఫ్ ఇంకా సాగదీత వ్యవహారంలా తయారౌతుంది. సెకండ్ హాఫ్ నడిచిన తీరులో దర్శకుడి అపరిపక్వత కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో టెంట్ హౌస్ తో హడావిడి చేసిన దర్శకుడు.. అది తగలబడిపోయిన నెపంతో అప్పటి వరకూ జరిగిందంతా పక్కన పెట్టేస్తాడు. అంటే ఫస్ట్ హాఫ్ లో అసలు కథే లేదు. యూట్యూబ్ వీడియోల ద్వారా వీళ్ళు ఫేమస్ అవ్వాలి. ఇది సెకండ్ హాఫ్ మధ్యలో మొదలౌతుంది. ఇది కూడా పెద్ద ఆసక్తిగా ఏం వుండదు. యూట్యూబ్ లో వీడియోలు చేయడం ఎలా ? వ్యూస్ ఎలా పెంచుకోవాలి ? ఎలాంటి కాన్సప్ట్ లు చేయాలి ? ఇలాంటి విష‌యాల‌కు ట్యూటోరియల్ గా మారిపోతుంది. తర్వాత అవే వీడియోలతో గ్రామ సమస్యలు తీర్చి పరమ రొటీన్ శుభం కార్డు పడిపోతుంది.

నిజానికి ఈ కథలో కొత్తదనం, ఒరిజినాలిటీ రెండూ లేవు. పెళ్లి చూపులు, జాతిరత్నాలు, ఈ నగరానికి ఏమైయింది, సినిమా బండి .. ఇలా ఒకటి కాదు.. గత పదేళ్ళతో వచ్చిన యూత్ ఫుల్ సినిమాల ఛాయలు ఇందులో అడుగడుగునా కనిపిస్తుంటాయి. కనిపించడంలో తప్పులేదు. కానీ అవేవీ కూడా థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వవు. యూట్యూబ్ కంటెంట్ లానే సినిమా అంత సాగుతుంది. అంతా కొత్తవాళ్ళతో చేస్తున్నప్పుడు కంటెంట్ కొంచెం కొత్తగా ప్లాన్ చేసి వుంటే బావుండేది. కానీ అది కాస్త రెగ్యులర్ అయిపొయింది.

ఈ సినిమాలో మెచ్చుకోదగ్గ అంశాలు కూడా వున్నాయి. చాలా క్లీన్ గా తీశారు. ఎక్కడా కూడా అసభ్యంగా అనిపించదు. చివర్లో వచ్చిన గోరేటి వెంకన్న పాట, అంజిమామ – ఎంజాయ్ మామ పాత్ర, చిన్న కుర్రాడు లిప్ స్టిక్ స్పాయిలర్ చేసే హడావిడి కొంత వినోదాన్ని పంచుతాయి. అక్క‌డ‌క్క‌డ కాస్త వినోదం వ‌ర్క‌వుట్ అయ్యింది. కుర్రాళ్ల‌ను మెప్పించే స‌న్నివేశాలు కూడా క‌నిపిస్తాయి. కాక‌పోతే ఈ సినిమాని నిల‌బెట్ట‌డానికి ఇవేం స‌రిపోవు.

నటుడు, దర్శకుడు సుమంత్ ప్రభాస్ లో యీజ్ వుంది. మొదటి సినిమాలోనే చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అసలు ఇది తన మొదటి సినిమాలా అనిపించదు, అంత సహజంగా కదిలాడు. తన టైమింగ్, స్క్రీన్ ప్రజన్స్ బావుంది. స్నేహితుల‌ పాత్రలలో కనిపించిన మణి, మౌర్య ఆకట్టుకుంటారు. సార్య, సిరారాసి నటన డీసెంట్ గా వుంది. గ్రామ సర్పంచ్, మురళిధర్ గౌడ్ మిగతా పాత్రలన్నీ పరిధిమేరకు వుంటాయి.

టెక్నికల్ గా సింక్ సౌండ్ దెబ్బకొట్టింది. టెక్నాలజీ వాడటం సరిగ్గా రాలేదనిపిస్తుంది. కొన్ని డైలాగులు స్పష్టంగా వినిపించవు. కెమెరా, సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఈ కంటెంట్ కి తగ్గ ఖర్చు పెట్టారు నిర్మాతలు. టికెట్ కొని థియేటర్ కి వెళ్ళే ప్రేక్షకుడికి కొన్ని అంచనాలు వుంటాయి. ప్రతి సినిమా బాహుబలిలా వుండాల్సిన అవసరం లేదు. తెరపై చూడదగ్గ సినిమాలా అనిపించాలి. ఈ విషయంలో మేమ్ ఫేమస్ చాలా వెనుకబడిపోయింది.

తెలుగు360 రేటింగ్‌: 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉక్క‌పోత‌… ఈసీతో పోరుకు వైసీపీ సిద్ధం!

ఫ్యాన్ గాలికి తిరుగులేదు... మేమంతా సిద్ధం అంటూ వైసీపీ చేస్తున్న ప్ర‌చారం తేలిపోతుంది. ఆ పార్టీకి గ్రౌండ్ లోనూ ఏదీ క‌లిసి రావ‌టం లేదు. అంతా తానే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ కు...

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close