చిలక జోస్యాలు చెప్పించుకుని ప్రచారం చేసుకుంటున్న వైసీపీ !

ఏపీలో జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు వెల్లడిస్తూండటంతో వైసీపీ స్ట్రాటజిస్టులు చిలక జోస్యాలపై వైపు మొగ్గుతున్నారు. ఐ ప్యాక్ వ్యూహకర్తలు.. ఏపీలో జగన్ కు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పుకునేందుకు విచిత్రమైన ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే… నలుదిక్కులా ఉన్న చిలక జోస్యం చెప్పే అస్ట్రాలజర్లను పట్టుకుని వారితో ట్వీట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారని వారు ట్వీట్లు చేస్తున్నారు. ఆ ట్వీట్లను పట్టుకుని ఇక్కడ ఐ ప్యాక్ టీమ్.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.

వరుసగా నలుగురు, ఐదుగురు అస్ట్రాలజర్ల పేరుతో ట్వీట్లు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని జోక్యం చెప్పిన ఓ అస్ట్రాలజర్ తోనూ ట్వీట్ చేయించారు. ఆయన ట్వీట్ ను వైసీపీ నేతలు ప్రచారం చేసుకునేలోపే పాత ట్వీట్ వైరల్ అయింది. తాజాగా… హర్యానా కు చెందిన ఓ అస్ట్రాలజర్ తో ట్వీట్ చేయించారు. ఇలా వరుసగా సమయం సందర్భం లేకుండా జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని.. జగన్ సీఎం అవుతారని ఎందుకు ట్విట్టర్‌లో జోస్యాలు చెప్పిస్తున్నారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అయితే ఉత్తరాది జనం ఈ జోస్యాలను నమ్ముతారేమో కానీ ఏపీలో మాత్రం.. కామెడీగా చూస్తారు. అదే జరుగుతోంది.

జగన్ మళ్లీ సీఎం అవ్వాలో లేదో తేల్చేది ఏపీ జనం. అసలు ఆంధ్రాకు ఎప్పుడూ రాని చిలకజ్యోతిష్టులు… డబ్బులు తీసుకుని ఓ ట్వీట్ పడేస్తే.. వాటిని చూపించి ఇక్కడ జగన్ గెలుస్తారని ప్రచారం చేసుకోవడం .. వారి భావదారిద్య్రానికి నిలువెత్తు సాక్ష్యం. ప్రజల్లో ఉన్న వ్యతిరికేత తగ్గాలంటే… చేసిన తప్పుల్ని దిద్దుకోవాలి కానీ.. చిలక జోస్యాలు చెప్పించుకుని ప్రచారం చేయించుకుంటే… పరువే పోతుంది. ఇలాంటి ప్రయత్నాలతో ప్రజల్ని మభ్య పెట్టగలమనుకుంటే… చివరికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close