భూల్ భులాయా.. ఆ హీరో ఎవ‌రో..?!

బాలీవుడ్ లో రెండొంద‌లు కోట్లు తెచ్చిన సినిమా ‘భూల్ భులాయా 2’. బాలీవుడ్ వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు ఊర‌ట‌గా వ‌చ్చిన సూప‌ర్ హిట్ ఇది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రీమేక్ రైట్స్ జ్ఞాన‌వేల్ రాజా ద‌క్కించుకొన్నారు. ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. రాక్షసుడు రీమేక్ తో.. ఓ మంచి హిట్ కొట్టాడు ర‌మేష్ వ‌ర్మ‌. అందుకే ఆయ‌న చేతికి మ‌రో రీమేక్ వ‌చ్చింది. క‌థ సిద్ధం, నిర్మాత‌, డైరెక్ట‌ర్ రెడీ. మ‌రి ఈ సినిమాలో హీరో ఎవ‌రన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.

నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ నాగ చైత‌న్య ఈ సినిమా చేస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. అయితే… చైతూ ఇందులో న‌టించ‌డం లేద‌ని పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఈ క‌థ చైతూ ద‌గ్గ‌ర‌కే వెళ్ల‌లేదు. మ‌రి ఆ వార్త‌లు ఎలా పుట్టాయో? ఈ క‌థ‌కున్న మూడు బెస్ట్ ఆప్ష‌న్స్‌… క‌ల్యాణ్‌రామ్‌, వ‌రుణ్‌తేజ్‌, నితిన్‌. ఈ ముగ్గురు చుట్టూనే ఈ స్క్రిప్టు తిరుగుతోంది. క‌ల్యాణ్ రామ్ ఈ సినిమా చేయ‌డానికి రెడీగానే ఉన్నాడు. ఆయ‌న‌కే ఖ‌రారయ్యే అవ‌కాశాలున్నాయి. అయితే వ‌రుణ్‌, నితిన్‌ల‌కు ఈ సినిమా ఇంకా బాగుంటుంది. వాళ్ల ఎన‌ర్జీకి ఈ క‌థ మ్యాచ్ అవుతుంది. కాక‌పోతే ఎవ‌రు చేసినా.. మినిమం గ్యారెంటీ సినిమా అవ్వ‌డం ఖాయం. మ‌రి ఈ హార‌ర్ సినిమా ఏ హీరోకి ద‌క్కుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close