చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో స్కాం జరిగిందంటూ పెట్టిన కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శనివారం తెల్లవారు జామున చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ.. ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టింది . ఉదయం నుంచి వాదనలు విన్న కోర్టు.. తీర్పు చెప్పడానికి ఐదారు గంటల సమయం తీసుకుదంి. చివరికి ఏడు గంటల సమయంలో ఆయనను రిమాండ్ కు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు

సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించింది. రిమాండ్ రిపోర్టులో ఉన్న అంశాలను వివరించారు. సెక్షన్ 409 పెట్టడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అని కోర్టు అడిగితే అన్నీ రిమాండ్ రిపోర్టులో చెప్పామన్నారు ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు అరెస్టు స‌మాచారం గ‌వ‌ర్న‌ర్‌కి ఇవ్వ‌క్క‌ర్లేద‌ని, స్పీక‌ర్ కి స‌మాచారం ఇస్తే చాలు అని, సీఐడీ స్పీక‌ర్ కి స‌మాచారం ఇచ్చామ‌ని కోర్టుకి ఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి నివేదించారు.

చంద్రబాబు తరపున సిద్ధార్థ లూద్రా వాదనలు

మరో వైపు సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూధ్రా… మొదట పాయింటి అసలు నంద్యాల కోర్టు ఉండగా… విజయవాడకు ఎందుకు తెచ్చారని లేవనెత్తారు. తర్వాత చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు, దర్యాప్తు అధికారుల ఫోన్ కాల్ డేటాను.. కోర్టులో సమర్పించాలని కోరారు. ఆ తర్వాత కేసు మెరిట్స్ లోకి వెళ్లారు. రిమాండ్ రిపోర్టులో ప్రతి అంశంపై ఆయన వాదించారు. దర్యాప్తు అధికారి వాడిన భాషను గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం తప్ప.. ఇంకేమీ కాదన్నారు. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది.. ఈకేసు ఎప్పుడో ముగిసింది. నిందితులందరికీ బెయిల్ వచ్చింది. న్నికలు వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

చంద్రబాబుపై చేసినవి ఆధారాల్లేని ఆరోపణలు.. ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందన్నారు. సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదని పలు తీర్పులను ఉదహరించారు. ఇదే కేసులో ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకున్న సమయంలో సెక్షన్-409 వర్తించదని కోర్టు చెప్పిందన్నారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు.. కాబట్టి సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుంది..? కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 24 గంటలపాటు చంద్రబాబును ఎందుకు నిర్భందించారో అర్థం కావట్లేదన్నారు. చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు సీఐడీ చెబుతోంది..కానీ బాబును ముందురోజు రాత్రి 11 గంటలకే సీఐడీ పోలీసులు చుట్టుముట్టారన్నారు. రాత్రి 11 గంటలకు చుట్టుముట్టి కదలకుండా చేయడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదు. బాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరం అని స్పష్టం చేశారు.

అయితే కోర్టు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనను సమర్థించి .. 14 రోజుల రిమాండ్ విధించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోకేష్ కు పార్టీ పగ్గాలు…తెరపైకి కొత్త డిమాండ్..!!

టీడీపీ అద్యక్ష బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగించాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కీలక నేత బుద్దా వెంకన్న ఇది రిక్వెస్ట్ కాదు మా డిమాండ్ అంటూ చెప్పుకొచ్చారు....

వైసీపీ నేతలను స్వయం సంతృప్తి చెందేలా నీలి మీడియా కథనాలు..!!

వైసీపీ అనుకూల మీడియా ప్లాన్ మార్చింది. ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో వ్యూహాత్మకంగా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారా..? అనే కథనాలను తెరపైకి తీసుకొచ్చింది. పోలింగ్ ట్రెండ్స్ చూసిన ఎవరికైనా...

గొడవలు చేసింది వైసీపీ – నీతులు చెబుతోంది కూడా వైసీపీనే !

ఏపీ అధికార పార్టీ ఏ మాత్రం నీతి లేకుండా చేస్తున్న స్కిట్స్ ప్రజల్ని ఔరా అనిపిస్తున్నాయి. ఏపీలో జరిగిన ప్రతి అల్లరి వెనుక.. ప్రతి ఘర్షణ వెనుక వైసీపీ కార్యకర్తలే...

బయాస్ చేసుకుంటే ప్రశాంత్ కిషోర్‌కు ఇంత పేరు వచ్చేదా !?

కరణ్ థాపర్ తో ప్రశాంత్ కిషోర్ ఇంటర్యూ తర్వాత ఆయనపై రాజకీయవర్గాల్లో విస్తృతమైన దాడి జరుగుతోంది. ఆయన బీజేపీ కోసం పని చేస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. దానికి కారణం బీజేపీకి సీట్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close