ఏపీ మద్యం స్కాం : వేల కోట్ల దోపిడి – మందబాబుల ఆరోగ్యం గుల్ల !

ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపడిన తర్వాత అక్కడ జరిగిన నేరాల గురించి.. డబ్బుల ట్రాన్సాక్షన్స్ గురించి తెలిసిన తర్వాత ఏపీలో అందరూ.. .. ఓసోస్ ఇదెంత… ఏపీలో మద్యం పాలసీ పేరుతో జరుగుతున్న స్కాంలో ఈకంత అని అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న మద్యం స్కాం కనీవినీ ఊహించనిది. అంచనా వేయలేనిది. ప్రజల ఆరోగ్యాల్ని .. పణంగా పెట్టి మరీ.. వారి రక్త మాంసాల్ని పిండుకుంటున్న వేల కోట్ల అవినీతి బాగోతం. ఒక్క మద్యం దుకాణంలో ఏం జరుగుతుందో బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి బయట పెట్టారు.

అంతా ప్రభుత్వ కనుసన్నల్లో ఇక అవినీతి ఎక్కడ అని ప్రచారం చేస్తారు కానీ… మొత్తం అక్కడే అవినీతి ఉంది. ఏపీలో స్కాం చాలా పెద్దది. కొన్ని వేల కోట్లు నగదు రూపంలో లావాదేవీలు జరుగుతున్నాయి. దర్యాప్తు అంటూ ప్రారంభిస్తే పెద్ద తలకాయలు ఈజీగా దొరికిపోతాయి. ఇతర రాష్ట్రాల్లో మద్యం స్కాంలను చూసిన తర్వాత ఏపీ లిక్కర్ పాలసీ గురించి ఎవరైనా తెలుసుకుంటే.. ముందు అసలు చరిత్రలో కనీ వినీ ఎరుగని స్కాం ఇక్కడ జరిగి ఉంటుంది కదా అన్న అభిప్రాయం ఎవరికైనా వస్తుంది.

మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వ పెద్దల గుప్పిట్లో ఉంది. అమ్మేది ప్రభుత్వం పేరు మీద. కానీ అందులో మనుషులు దగ్గర్నుంచి లిక్కర్ తయారీ బ్రాండ్లు, రవాణా సహా మొత్తం అయిన వాళ్ల గుప్పిట్లోనే ఉంది. పైగా అంతా పూర్తిగా నగదు లావాదేవీలు. ఎన్ని వేల కోట్లు వెనకేశారో చెప్పడం కష్టం. అలాంటి స్కాంపై ఇంకా కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు బీజేపీ నేతలే విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో ప్రత్యక్షంగా చూపించారు. ఈ లిక్కర్ పాలసీపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.

పురందేశ్వరి సీబీఐకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు ఒక్క సారి అడుగు పెడితే సంచలన విషయాలు బయటకు వస్తాయి.
ఇప్పుడు చాయిస్ బీజేపీ హైకమాండ్ చేతుల్లో ఉంది. నేరుగా సీబీఐ దిగడానికి చాన్స్ లేకపోతే.. ఈడీ దిగవచ్చు. అలా దిగితేనే .. బీజేపీ. .. కేంద్రం.. చిత్తశుద్ధిపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close