రివ్యూ : ది గ్రేట్ ఇండియన్‌ సూసైడ్‌ (ఆహా ఓటీటీ)

ఢిల్లీ బురారీ మాస్ సూసైడ్ కేసు ఓ సంచలనం. ‘హౌస్ ఆఫ్ సీక్రెట్స్’ పేరుతో నెట్ ఫ్లిక్స్ లో దీనిపై ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది. అందులో కూడా ఆ మాస్ సూసైడ్ వెనుక వున్న స్పష్టమైన కారణాలు, నిజాలు చూపించలేదు. ఇప్పటికీ ఒక రహస్యంగానే వుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మదనపల్లి ఘటన కూడా సంచలనం సృష్టించింది. ఇలాంటి ఆత్మహత్యలని కల్ట్ సూసైడ్ అని పేర్కొంటారు. కల్ట్ సూసైడ్ అంటే.. సూసైడ్ వెనుక ఒక ఫిలాసఫీ వుండటం. ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక విధానం కావచ్చు.. బలంగా ఒక విషయాన్ని నమ్మించి ఆత్మహత్యలకు ప్రేరేమించడం. ఇండియాలోనే కాదు.. ఇలాంటి ఘటనలు బంగ్లాదేశ్, జర్మనీ, అమెరికా ఇలా చాలా దేశంలో చోటు చేసుకున్నాయి. ఇదే నేపధ్యంలో కొంత ఫిక్షన్ ని జోడించి హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ ఆహా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ఎంత ఆసక్తికరంగా సాగింది ? యాధార్ధ సంఘటనలకు ఊహని జోడించిన ఈ చిత్రంలో ఎలాంటి మలుపులు వున్నాయి ?

హేమంత్ (రామ్‌ కార్తీక్‌) అనాథ. స్నేహితుడితో కలిసి కాఫీ షాపు నడుపుతూ ఉంటాడు. హోమ్ మేడ్ కుకీస్‌ ని అమ్మడానికి కేఫ్ కి వస్తుంది చైత్ర (హెబ్బా పటేల్‌). తొలి పరిచయంలోనే ఆమెను ఇష్టపడతాడు హేమంత్. తన ప్రేమని వ్యక్తిని చేసిన హేమంత్ నిరాశ ఎదురౌతుంది. హేమంత్ ప్రేమని చైత్ర అంగీకరించదు. దీంతో ఊరు విడిచి వెళ్లిపోవాలనుకుంటాడు హేమంత్. విషయం తెలుసుకున్న చైత్ర.. ప్రేమను అంగీకరించకపోవడానికి అసలు కారణం చెబుతుంది. త్వరలోనే తనతో పాటు తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోబోతోందని చెబుతుంది. ఇలా సాముహిక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి రావడానికి… కారు ప్రమాదంలో చనిపోయిన తన పెదనాన్న బళ్ళారి నీలకంఠ (నరేష్‌)ను తిరిగి బతికించుకునేందుకు ఇదొక మార్గమని వాళ్ళ నమ్మకం. ఈ విషయం తెలుసుకున్న హేమంత్ షాక్‌ అవుతాడు. తను ప్రేమించిన చైత్రను కాపాడుకునేందుకు ఆమెను పెళ్లి చేసుకొని ఆ కుటుంబంలో ఒకడిగా వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది ? అసలు సాముహిక ఆలోచన ఆ కుటుంబంలో కలిగించింది ఎవరు ? హేమంత్ ఆ కుటుంబాన్ని రక్షించుకోగలిగాడా లేదా ? అనేది మిగత కథ.

మాస్ సూసైడ్ నేపధ్యంలో యాధార్ధ సంఘటనలు ఆధారం కొంత ఫిక్షన్ ని జోడించి తీసిన చిత్రమిది. బళ్ళారి నీలకంఠ కారు ప్రమాదంలో చనిపోయే సన్నివేశంతో ఈ కథ మొదలుపెట్టాడు దర్శకుడు. తర్వాత హేమంత్, చైత్రల ప్రేమకథ తెరపైకి వస్తుంది. మొదట్లో కాస్త సాగదీతగా అనిపించినా ఆ ప్రేమకథకు పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టి అసలు కథలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు. ఎప్పుడైతే హేమంత్.. చైత్రవాళ్ళ ఇంటికి వెళ్ళాడో ఆ కుటుంబంలోని ఒకొక్క పాత్ర పరిచయం చేస్తూ ప్రతి పాత్రపై అనుమానం రేకెత్తించేలా కొన్ని సన్నివేశాలు చూపించారు. అలాగే బళ్ళారి నీలకంఠ గదిచుట్టూ అల్లుకున్న సన్నివేశాలు కూడా ఆసక్తిగానే వుంటాయి. చనిపోయిన బళ్ళారి నీలకంఠ మాటలు వినిపించడం, త్వరలోనే వచ్చేస్తామని చెప్పడం, చెంబు కదిలిపోవడం. .. ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచుతాయి.

నిజానికి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కి తగ్గ అన్ని ఎలిమెంట్స్ కుదిరాయి. అయితే ఇలాంటి కథలకు చిక్కుముళ్ళు విప్పే నేర్పు కూడా వుండాలి. అసలు ఈ ఆత్మహత్యలని ప్రేరేపించింది ఎవరు ? అని తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే వుంటుంది. హేమంత్ ఇంటికి వచ్చినప్పటినుంచే ఈ దిశగా విచారణ వుండాల్సింది. అలాగే మరో కొన్ని రోజుల్లో చనిపోవడానికి సిద్ధమైన ఓ కుటుంబం ఓ కొత్త వ్యక్తి ఇంటికి వచ్చాడని తెలిసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ కూడా తేడాగా వుంటుంది. కానీ ఇందులో హేమంత్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్లు సింపుల్ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఒక్కటైపోతారు. అలాగే నకిలీ తాళం చెవితో నీలకంఠ గదిలోకి వెళ్ళిపోయి తనకు కావాల్సిన సమయం గడిపివస్తుంటాడు హేమంత్. నీలకంఠ ఆస్తిపై కన్నేసి ఎవరైనా ఇలాంటి పధకం వేశారా ? అనే కోణంలో హేమంత్ జరిపే విచారణ కాస్త లేజీగా వుంటుంది. అలాగే ప్రేక్షకులు థ్రిల్ ఇచ్చే క్రమంలో లాజిక్ కి అందని చాలా సన్నివేశాలని వాడుకున్నారు. వాటి లాజిక్ ని చెప్పే క్రమంలో చాలా హాడావిడి జరిగిపోయింది. చివరి పదిహేను నిమిషాల్లో కథ చాలా మలుపులు తిరిగేస్తుంది. అందులో కొన్ని మలుపులు కాస్త గంధరగోళంగా వుంటాయి. అయితే ఓటీటీ సినిమానే కాబట్టి వెనక్కి వెళ్లి చూసుకునే వెసులుబాటు వుంది. చివర్లో దర్శకుడు ఓ సామాజిక రుగ్మతని చూపించాడు. ఈ సినిమాకి మొదట్లో ‘తెలిసినోళ్ళు’ అనే టైటిల్ పెట్టారు. నిజానికి ఈ కథకు మూలమైన టైటిల్ అదే. దాని గురించి కొంచెం రివిల్ చేసినా.. కథలో థ్రిల్ పోతంది.

చైత్రగా చేసిన హెబ్బా నటన బావుంది. చివర్లో ఆమె కనబరిచిన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇది ఆమెకు ప్రత్యేకమైన పాత్రే. రామ్ కూడా ఆకట్టుకున్నాడు. బళ్ళారి నీలకంఠయ్య పాత్రలో నరేష్, ఆయన భార్య పాత్రలో పవిత్ర లోకేష్ కనిపించారు. నరేష్ మెథడ్ యాక్టర్. ఆయనకి ఎలాంటి పాత్ర ఇచ్చిన అందులోకి దూరిపోతారు. నీలకంఠ పాత్రలో కూడా సహజంగా చేశాడు. మిగతానటీనటులు అంతా పరిధిమేర చేశారు. శ్రీచరణ్ అందించిన నేపధ్య సంగీతం బావుంది. కెమరాపనితనం ఇలాంటి సినిమాలకీ చాలా ముఖ్యం. విజువల్స్ లైటింగ్ ఇంకాస్త టెర్రిఫిక్ గా వుండాల్సింది. ఓటీటీ సినిమా ఇది. నిర్మాణ విలువలు దానికి తగ్గట్టే వున్నాయి. థ్రిల్ ని పంచడంలో దర్శకుడు చాలా చోట్ల సక్సెస్ అయ్యాడు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ సమయం కుదిరినప్పుడు ఈ కల్ట్ సూసైడ్ థ్రిల్లర్ పై ఓ లుక్ వేయొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తిట్లు,విధ్వంసం, రౌడీయిజానికా పాజిటివ్ ఓటు సజ్జలా !?

పాజిటివ్ ఓటు వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ అయిపోగానే గోళ్లు గిల్లుకుంటూ మీడియాకు చెప్పారు. వైసీపీకి మద్దతు పలికేందుకు అంత పరుగులు పెట్టి ఓటర్లు రావడానికి అవసరమయ్యే ఒక్క పాజిటివ్ కారణం...

ఏపీలో పోలింగ్ పర్సంటేజీ 82 ప్లస్!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు చైతన్యం వెల్లి విరిసింది. కొత్త ఓటర్లతో పాటు యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడంతో పోలింగ్ ఊహించనంతగా పెరిగింది. గత ఎన్నికల్లో 79 శాతం ఈవీఎం ...

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close