కోల్‌కతాలో ఏపీ ఇసుక టెండర్లు – రాజధాని అక్కడకు మార్చారా ?

ఆంధ్ర ఇసుకను దోపిడీ చేయడానికి కోల్ కతాలో టెండర్లు వేశారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా నిజం. ఏం.. ఏపీ సర్కార్ తమ రాజధానిని కోల్‌కతాకు మార్చిందా.. ఆ జీవో ఏమైనా రహస్యంగా ఉంచారా అన్న డౌట్లు ఇలాంటివి విన్నప్పుడే వస్తూంటాయి. ఏపీ ఓ రాష్ట్రం. దానికో రాజధాని ఉంది. ఆ రాజధాని గుర్తించడానికి ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే… చాలా నగరాలు ఉన్నాయి. టెండర్ నిర్వహించే కంపెనీ బ్రాంచులు కూడా ఉన్నాయి. అయినా కోల్ కతాలో ఎందుకు పెట్టారు ?

గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకతో ఈ ప్రభుత్వం తైలం పిండుతోంది. ప్రజల ఉపాధిని పణంగా పెట్టి వేల కోట్లు అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా తవ్వేసుకుంటున్నారు. ఒకే సంస్థకు ఇసుకను కట్టబెట్టేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ జేపీ సంస్థ పేరుతో తవ్వుకున్నారు. ఇప్పుడు మళ్లీ టెండర్లు పెలిచి… జగన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డికి కట్టబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు అనుకూలంగా టెండర్ రూల్స్ మార్చి ప్రయత్నిస్తున్నారు. దీనిపై దుమారం రేగుతోంది.

ఇసుక దోపిడీకి చేస్తున్న ప్రయత్నాలన్నీ కళ్ల ముందే ఉండటంతో… టీడీపీ నేతుల సీబీఐ, విజిలెన్స్ లకు ఫిర్యాదు చేశారు. అయితే బీజేపీ అధ్యక్షురాలు ఫిర్యాదు చేస్తనే పట్టించుకోరు. ఇక వీరు చేస్తే పట్టించుకుంటారా అన్న డౌట్ సామాన్యులకు వస్తుంది. కానీ కళ్ల ెదుట జరుగుతున్న దోపిడీకి సాక్ష్యాలు కనిపిస్తున్నా సైలెంట్ గా ఉన్నారని ప్రజలకు తెలిసే వ్యూహంతోనే వారు ఫిర్యాదులు చేస్తున్నారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close