కాంగ్రెస్‌ను చూపి భయపెట్టడమే బీఆర్ఎస్ క్యాంపైనా థీమ్ !

తెలంగాణలో రాజకీయ ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవిత స్టార్ క్యాంపెయినర్లుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచార థీమ్ ఒక్కటే .. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు నరకం కనిపిస్తుదంని చెప్పడం. అది ఏ అంశమైనా సరే.. కాంగ్రెస్ వస్తే… భరించలేరని ప్రజల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీజేపీ అనే మాట బీఆర్ఎస్ ననాయకుల వద్ద నుంచి పెద్దగా వినిపించడం లేదు. మొత్తం కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతుంది. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఉండదు. కాంగ్రెస్ వస్తే రోడ్లు వేయరు, కాంగ్రెస్ వస్తే సంక్షేమం ఉండదు, కాంగ్రెస్ వస్తే కబ్డాలు పెరుగుతాయి… కాంగ్రెస్ వస్తే దోచుకుంటారు. ఇలా పదే పదే చెబుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ ప్రచారంలో మొదట ఇవే ఉంటున్నాయి. తర్వాత పదేళ్లలో తాము ఏం చేశామో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పాజిటివ్ అంశాలు ప్రజల్లోకి వెళ్లడం కష్టం కాబట్టి కాంగ్రెస్ పైనే ప్రధానంగా ఎటాక్ చేస్తున్నారు.

మరో వైపు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. ఆయన డబ్బులు వసూలు చేసి టిక్కెట్లు ఇచ్చారని…. ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలే చెబుతున్నారంటూ… కేటీఆర్ తరచూ విమర్శిస్తూ ఉంటారు. కాంగ్రెస్ సమరాన్ని రేవంత్ రెడ్డి లీడ్ చేస్తున్నారు. ఆయన వ్యూహాలు బీఆర్ఎస్‌కు గట్టి సవాల్ ఇచ్చేలానే ఉన్నాయి. అందుకే రేవంత్ ను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు.

అయితే కాంగ్రెస్ గురించి ఎక్కువగా మాట్లాడం ద్వారా ఆ పార్టీకి అదనపు ప్రయోజనం కల్పిస్తున్నారేమోనన్న వాదన కూడా కొంత మందిలో ఉంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎక్కడా ప్రచారంలోకి రాలేదు కానీ.. కాంగ్రెస్ గ్యారంటీలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close