ఆనంద్‌ దేవరకొండకి హ్యాండ్ ఇచ్చిన బేబీ

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ముక్కోణపు ప్రేమకథా చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాన్ని రాబట్టింది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ జోడిని మళ్ళీ రిపీట్ చేయలని అనుకున్నాడు మిథున్ అనే కొత్త దర్శకుడు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ రూపొందబోయే ఈ చిత్రానికి ‘డ్యూయెట్‌’ అనే టైటిల్ అనుకున్నారు. ఇందులో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడిగా నటిస్తారని నిర్మాతలు కూడా ప్రకటించారు.

అయితే ఇప్పుడా జోడి కుదరడం లేదు. ఈ ప్రాజెక్ట్ లో వైష్ణవి చైతన్య నటించడం లేదు. ‘డ్యూయెట్‌’నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే బేబీ నిర్మాత ఎస్కేఎన్, గీతా ఆర్ట్స్ నిర్మాతలతో మూడు సినిమాలకు అగ్రీమెంట్ చేసుకుంది వైష్ణవి చైతన్య. బేబీకి ముందే ఈ అగ్రీమెంట్ జరిగింది. ఆ మూడు సినిమాలు పూర్తయితే గానీ మరో సినిమా చేయడానికి లేదు. అందుకే ఈ జోడి రిపీట్ కావడం కుదరలేదు. వైష్ణవి చైతన్య స్థానంలో రితిక నాయక్ ని తీసుకున్నారు. ఇంతకుముందు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా చేసింది రితిక. ఇప్పుడిది రెండో సినిమా. ఈ గురువారం సినిమాని లాంచ్ చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close