టేబుల్ ప్రాఫిట్‌… అజ‌య్ భూప‌తి పాస్‌!

ఈరోజుల్లో సినిమా జ‌యాప‌జ‌యాల్ని నిర్ణ‌యించేవి ఆర్థిక ప‌ర‌మైన గ‌ణాంకాలే. సినిమాకి లాభం వ‌స్తే హిట్టు. న‌ష్ట‌మొస్తే ఫ్లాప్‌. టేబుల్ ప్రాఫిట్ తీసుకొస్తే సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా, ద‌ర్శ‌కుడిగా పాస్ అయిపోయిన‌ట్టే. మంగ‌ళ‌వారం విష‌యంలో అదే జ‌రిగింది. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్ర‌మిది. పాయ‌ల్ రాజ్‌పుత్ కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌లైంది. గురువారం కొన్ని థియేట‌ర్ల‌లో పెయిడ్ ప్రీమియ‌ర్లు వేశారు. రివ్యూల ప‌రంగా యావ‌రేజ్ టాక్ ద‌గ్గరే ఆగిపోయింది. అయితే.. ఈ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ ద‌క్క‌డం విశేషం. ఈ సినిమాకి రూ.16 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఓటీటీ రూపంలోనే అందులో స‌గం వెన‌క్కి వ‌చ్చేశాయి. కెపాసిటీకి మించిన థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డం వ‌ల్ల హౌస్ ఫుల్ బోర్డులు క‌నిపించ‌డం లేదు కానీ, ఓవ‌రాల్ గా వ‌సూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి. సీడెడ్‌, నైజాంల‌తో పోలిస్తే ఆంధ్రాలో మంచి క‌లక్ష‌న్లు వ‌స్తున్నాయి. ఓవ‌రాల్ గా డిస్టిబ్యూట‌ర్లు హ్యాపీ. ఈ వారం మ‌రో సినిమా పోటీ లేక‌పోవ‌డం వ‌ల్ల‌, ఉన్న సినిమాల‌న్నీ మ‌రింత డ‌ల్‌గా క‌నిపించ‌డం వ‌ల్ల‌… మంగ‌ళ‌వారం ఒడ్డున ప‌డిపోవ‌డం ఖాయంగా అనిపిస్తోంది. మ‌హా స‌ముద్రం ఫ్లాప్‌తో వెన‌క‌డుగు వేసిన అజ‌య్ భూప‌తికి ఈ రిజ‌ల్ట్ కాస్త ఉప‌శ‌మ‌నం ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

విశ్వసనీయత కోల్పోతున్న కేసీఆర్…?

అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతున్నారా..?ఇందుకు కారణం ఆయన వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలేనా..? అంటే...

ప్ర‌భాస్ ‘ఫ్రీ’గా చేస్తున్నాడా?

మంచు విష్ణు ఏం మంత్ర‌మేశాడో ఏమో, 'క‌న్న‌ప్ప‌' కోసం చాలామంది స్టార్ల‌ని త‌న టీమ్ లోకి తీసుకొన్నాడు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈరోజుల్లో ప్ర‌భాస్ తో సినిమాలో ఓ పాత్ర చేయించ‌డం ఏమంత...

బీఆర్ఎస్ కొంపముంచనున్న క్రాస్ ఓటింగ్..?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదా..? హోరాహోరీ పోరులో బీఆర్ఎస్ ను క్రాస్ ఓటింగ్ దారుణంగా దెబ్బతీయనుందా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close