మ‌ధుర‌వాణి… అంజ‌లి!

తెలుగు సాహిత్య చ‌రిత్ర‌లో మ‌కుటం లేని మ‌హారాజుగా నిలిచిన ర‌చ‌న‌… క‌న్యాశుల్కం. గుర‌జాడ అప్పారావు ర‌చించిన ఈ నాట‌కం గురించి ప్ర‌త్యేకంగా గుర్తు చేయాల్సిన ప‌నిలేదు. గిరీశం, మ‌ధుర‌వాణి అనే గొప్ప క్యారెక్ట‌ర్లని పుట్టించిన క‌థ ఇది. ఈ నాట‌కాన్ని సినిమాగా తీశారు. ఆ క్యారెక్ట‌రైజేష‌న్ల‌ను చాలామంది చాలా సినిమాల్లో వాడుకొన్నారు. ఇప్పుడు ఈ క‌న్యాశుల్కం వెబ్ సిరీస్ రూపంలో వ‌స్తోంది. క్రిష్ ఈ వెబ్ సిరీస్‌కి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌. ఆయ‌న సార‌ధ్యంలో ‘క‌న్యాశుల్కం’ వెబ్ సిరీస్ నిర్మించారు.

‘చూసీ చూడంగానే’ సినిమాతో దర్శ‌కురాలిగా ఆక‌ట్టుకొన్న శేష సింధూరావు ఈ వెబ్ సిరీస్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జీ 5 లో ప్ర‌సారం కానున్న ఈ వెబ్ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. మ‌ధుర‌వాణిగా అంజ‌లి, గిరీశంగా అవ‌స‌రాల శ్రీ‌నివాస్ న‌టించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ అర్థాంత‌రంగా ఆగిపోవ‌డంతో క్రిష్ కి ఈ వెబ్ సిరీస్ పై దృష్టి నిలిపే స‌మ‌యం ద‌క్కింది. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్ ప్ర‌చారాన్ని కూడా ప్రారంభించ‌నున్నారు. క్రిష్ సార‌థ్యం వ‌హించ‌డం, క‌న్యాశుల్కం లాంటి గొప్ప న‌వ‌ల‌ని తీసుకోవ‌డం, అంజ‌లి, అవ‌స‌రాల లాంటి న‌టీన‌టుల్ని ఎంచుకోవ‌డంతో ఈ వెబ్ సిరీస్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ సర్కార్ కు టైం ఫిక్స్ చేసిన బీజేపీ..!?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా..? కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం పీఠం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుందా..?అంటే వరుసగా...

వైసీపీ సోషల్ మీడియా సైలెన్స్ – ఐ ప్యాక్‌ను వదిలించుకున్నారా ?

వైసీపీ సోషల్ మీడియా ఒక్క సారిగా మూగబోయింది. మామూుగా అయితే ఈ పాటికి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తో హడలెత్తించాలి. కానీ పోలింగ్ రోజు మధ్యాహ్నానికి చేసిన ఫేక్ సర్వే వీడియోల...

వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్న వైసీపీ నేతలు

వైసీపీ నేతలు వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్నారు. నిరాశ నిండిన మొహాలతో ఈసీపై పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. పల్నాడులో తమ ప్లాన్ పారకపోవడంతో నేతలు నిరాశకు గురయ్యారు. ఈ రోజు...

జనసేన స్ట్రైక్ రేట్ ఎనభై శాతం ఉంటుందా?

జనసేన పార్టీ గత ఎన్నికల్లో చదవి చూసిన ఘోర పరాజయాన్ని మరిపించేలా ఈ సారి ఎన్నికల పలితాలు ఉంటాయని పోలింగ్ సరళి తర్వాత నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. మొత్తం ఇరవై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close