‘దేవ‌ర‌’ మిస్స‌యితే.. దేవ‌ర‌కొండ మిస్ అవ్వ‌డు

ఏప్రిల్ 5… బాక్సాఫీసుకి కీల‌క‌మైన డేట్. ఎందుకంటే… ఈ తేదీకి ముందూ, వెనుక సెల‌వ‌లే సెల‌వ‌లు. వీకెండ్, పండుగ‌లు క‌లిసొస్తున్నాయి. అందుకే ఏప్రిల్ 5 పై నిర్మాత‌లు గురి పెట్టారు. ఈ డేట్ ని ఎన్టీఆర్ `దేవ‌ర‌` ఏనాడో ఫిక్స్ చేసుకొంది. అయితే.. ఇప్పుడు ‘దేవ‌ర‌’ వెన‌క్కి వెళ్తుంద‌న్న వార్త‌లు ఊపందుకొన్నాయి. సైఫ్ అలీఖాన్ గాయం, అనిరుథ్ ఇంకా ట్యూన్లు ఇవ్వ‌క‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో… ‘దేవ‌ర‌’ ఏప్రిల్ 5న రాక‌పోవొచ్చ‌న్న‌ది టీ టౌన్ టాక్.

‘దేవ‌ర‌’ ఎప్పుడైతే డౌట్ లో ప‌డిందో, అప్పుడు దేవ‌ర‌కొండ అలెర్ట్ అయ్యాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ని ఏప్రిల్ 5న విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. నిజానికి ‘దేవ‌ర‌’ విడుద‌లైన వారానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ని తీసుకొద్దామ‌నుకొన్నారు. ఇప్పుడు ‘దేవ‌ర‌’ డౌట్ ప‌డేస‌రికి.. ఆ డేట్ ని దిల్ రాజు క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 9న రావాల‌నుకొన్న టిల్లు స్వ్కేర్ కూడా మంచి డేట్ కోసం ఎదురు చూస్తోంది. సోలో రిలీజ్ సెంటిమెంట్ ఏం లేక‌పోతే… ‘టిల్లు స్వ్కేర్’ కూడా ఎన్టీఆర్ వ‌దులుకొన్న డేట్ కే వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘విశ్వంభ‌ర’ టార్గెట్ ఫిక్స్!

విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ప్రాముఖ్యం ఉన్న క‌థ‌.. 'విశ్వంభ‌ర‌'. ఇలాంటి సినిమాల‌కు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ చాలా కీల‌కం. అందుకోసం వీలైనంత ఎక్కువ స‌మ‌యం తీసుకోవాలి. ఈ దిశ‌గానే 'విశ్వంభ‌ర‌' టీమ్ వేగంగా అడుగులేస్తోంది. అందుకోసం...

లండన్ కాదు అమ్‌స్టర్‌డామ్ !

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లలేదు. విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన ప్రత్యేక లగ్జరీ విమానం లండన్ వెళ్లింది కానీ.. అక్కడ ఎయిర్ పోర్టులో దిగడానికి అనుమతి లభించలేదు. మూడు సార్లు...

కేసీఆర్ తరహాలో జగన్ రెడ్డి – రిజల్ట్ మాత్రం సేమ్..!?

ఏడు నెలల కిందట తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేశారో, ఏపీ ఎన్నికల ఫలితాలపై జగన్ కూడా అదే తరహ ప్రకటనలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించబోతుందని...

మంత్రివర్గ సమావేశంపై సస్పెన్స్..!!

నేడు జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై సస్పెన్స్ నెలకొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ కేబినెట్ సమావేశానికి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి రిప్లై లేకపోవడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close