కేసీఆర్ ను జనం నెత్తిన పెట్టుకుంటారేమో

తెలంగాణ సర్కారు చేపడుతున్న అనేక అనేక కార్యక్రమాలలో ఇవాళ కీలకమైన ముందడుగు పడబోతోంది. గోదావరి నది మీద తెలంగాణ సర్కారు నిర్మించ దలచుకుంటున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన ఒప్పందం మీద సంతకం చేయబోతున్నారు. గోదావరి జలాలను తెలంగాణ ఉపయోగించుకోవడానికి సంబంధించి ఇది చాల కీలకమైన ముందడుగు. ఆంధ్ర పాలకులు ఎలినంత కాలమూ తెలంగాణ సమగ్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదంటూ తెరాస పోరాట సమయం నుంచి చేసిన అనేకానేక ఆరోపణలకు ఇప్పుడు జరుగుతున్నది ఒక నిదర్శనం అని కూడా అనుకోవచ్చు.

మన రాష్ట్రం మన పాలన అనే నినాదం తో అధికారం లోకి వచ్చిన తెరాస, ‘మన పాలన’ అంటే అర్ధం ఏమిటో ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు నిరూపించబోతున్నది. అందుకే… ఈ ఒప్పందం తరువాత ప్రాజెక్టులు కార్యరూపంలోకి కూడా వస్తే గనుక ప్రజలు కెసిఆర్ ను దేవుడిలా నెత్తిన పెట్టుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే కెసిఆర్ ప్రకటిస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఆ పార్టీకి ప్రజాదరణను పెంచుతున్నాయి. ఏ ఎన్నికలు జరిగినా తెరాస తిరుగులేని మెజారిటీతో గెలవడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ ప్రాజెక్టులు కూడా కార్యరూపంలోకి వస్తే ఇక పార్టీకి గొప్ప విజయం అని చెప్పాలి.

ఇన్ని దశాబ్దాలుగా మన రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న రోజుల్లో గోదావరి జలాలు వృధాగా సముద్రం పాలవుతున్నాయని అందరూ ఆవేదన చెందారు. పోలవరం లాంటి ఆలోచనలు వచ్చాయే తప్ప, తెలంగాణలో భౌగోళికంగా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునే అవకాశం లేదని అంత అంటూ వచ్చారు. గోదావరి జలాల వినియోగంలో తెలంగాణకు కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ సరైన సంకల్పం ఉంటే అది అసాధ్యం మాత్రం కాదని తెరాస సర్కారు నిరూపిస్తోంది. ఇదంతా కేవలం ‘మన పాలన’ వలన మాత్రమే సాధ్యమవుతున్న విషయం అని వారు చెబితే తప్పేముంది. అందుకే ఈ విజయం దక్కితే ఆ పార్టీ కి ప్రజాదరణ అమాంతం పేరుగుతుందనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంలో మంత్రి హరీష్ రావు చాల కీలక పాత్ర పోషించారు. అనేక దఫాలుగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి, ఒప్పందాలను ఈ దశ వరకు తీసుకు వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే… తన అధికారిక కార్యాలయం అయిన సెక్రటేరియెట్ లో కంటే, అధికారిక నివాసం అయిన సీఎం క్యాంపు ఆఫీస్ కంటే.. తన ‘తోట బంగాళా’ అదేనండి ఫామ్ హౌస్ లొనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడే కెసిఆర్ వంటి ముఖ్యమంత్రికి ఒక వైపు హరీష్ రావు, మరొక వైపు కేటీర్ వంటి సమర్థులైన నాయకులూ అండగా ఉండడం చాల గొప్ప అడ్వాంటేజ్ అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close