ప్ర‌భాస్ తో మృణాల్ ఠాకూర్‌?

ప్ర‌భాస్ – హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘క‌ల్కి’ పూర్త‌వ్వ‌గానే ఈ చిత్రానికి ప్ర‌భాస్ కాల్షీట్లు ఇవ్వ‌బోతున్నాడు. ఇప్ప‌టికే హ‌ను క‌థ‌ని సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ ఇది. పిరియాడిక‌ల్ సెట‌ప్‌లో సాగ‌బోతోంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల విష‌యంలో హ‌ను ఇప్ప‌టికే కొంత స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం కూడా ‘సీతారామం’ టీమ్‌నే కొన‌సాగించాల‌ని హ‌ను భావిస్తున్నాడ‌ట‌. క‌థానాయిక‌గా మృణాల్ ఠాకూర్ ఎంపిక దాదాపుగా ఖాయ‌మైంది. `సీతారామం`లో సీత‌గా క‌నిపించింది మృణాల్. ఆ సినిమా మృణాల్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ప్ర‌భాస్ తో త‌న జోడీ బాగుంటుంద‌ని హ‌ను భావిస్తున్నాడు. ‘సీతారామం’ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన సంగీత దర్శ‌కుడు విశాల్ భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి ప‌ని చేయ‌నున్నారు. ఇప్ప‌టికే విశాల్ తో మ్యాజిక్ సిట్టింగ్స్ కూడా మొద‌ల‌య్యాయ‌ని టాక్‌. కెమెరామెన్‌గా పి.ఎస్‌.వినోద్ నే కొన‌సాగించే అవ‌కాశాలు ఉన్నాయి. మొత్తానికి ‘సీతారామం’ సెట‌ప్ ప్ర‌భాస్ సినిమాలోనూ చూడొచ్చ‌న్న‌మాట‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close