ఈ వారమే ఎన్నికల షెడ్యూల్ – తొలి విడతలోనే ఏపీ పోలింగ్ !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమయింది . ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను మార్చి పదో తేదీన ప్రకకటించారు. అయితే ఈ సారి ఆలస్యం అయింది.. ఎన్ని రోజులు అన్నది ి సస్పెన్స ్గా మారింది. ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనుంది. అక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగలమనేది మూడు రోజుల పర్యటనలో అంచనా వేయనుంది. తర్వాత ఒకటి రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించవచ్చు.

షెడ్యూల్‌ను మార్చి 14-16 తేదీల మధ్యన ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబరు లోపు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించగలిగే అవకాశం ఉందేమో అంచనా వేయాలని కేంద్ర ప్రభుత్వం ఈసీని కోరింది.

సాధారణంగా లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆరేడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలోనే ఏపీ ఎన్నికలు ఉంటాయి. ఈ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏప్రిల్‌ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో పోలింగ్‌ జరిగే అవకాశముంది.య ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే ‘కోడ్‌’ అమలులోకి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close