‘షైతాన్’ రివ్యూ: వశీకరణ వణుకు పుట్టించింది కానీ…

Shaitaan movie review

హారర్ సినిమా అనగానే దెయ్యాలు, ఆత్మలు.. అవి పెట్టే భయాన్నే హైలెట్ చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా 2023లో ‘వష్’ అనే గుజరాతీ సినిమా వచ్చింది. వశీకరణ నేపథ్యంలో సాగిన సూపర్ నేచురల్ హారర్ ఇది. బహుశా ఇదే పాయింట్ నచ్చి అజయ్‌ దేవగణ్‌, ఆర్‌.మాధవన్‌, జ్యోతిక లాంటి పాన్ ఇండియా ఫేమ్‌ వున్న నటులతో ‘షైతాన్’ గా రీమేక్ చేశాడు క్వీన్ లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన డైరెక్టర్ వికాశ్‌భల్‌. మరి వశీకరణ ఎంతలా భయపెట్టింది? ఇందులో వున్న సూపర్ నేచురల్ హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులని ఎంగేజ్ చేశాయా?

కబీర్‌(అజయ్‌ దేవగణ్‌) ఓ చార్టర్డ్ అకౌంటెంట్. కబీర్ భార్య జ్యోతి (జ్యోతిక ). కూతురు జాన్వీ (జాంకీ). కొడుకు ద్రువ్. వీకెండ్ లో తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు ఫామ్‌హౌస్‌కు బయలుదేరుతాడు కబీర్. ఈ ప్రయాణంలో ఓ దాబా ద‌గ్గ‌ర‌ ఆగి భోజనం చేస్తారు. అక్క‌డే వనరాజ్‌ (ఆర్‌.మాధవన్‌) కబీర్ కుటుంబానికి పరిచయమౌతాడు. జాన్వీకి లడ్డుని ఆఫర్ చేస్తాడు వనరాజ్. జాన్వీ ఆ లడ్డుని తినేస్తుంది. అక్కడి నుంచి వనరాజ్‌ అధీనంలోకి వెళ్ళిపోతుంది జాన్వీ. అదే రోజు రాత్రి కబీర్ ఫామ్ హౌస్ కి వెళ్ళిన వనరాజ్, జాన్వీని తను వశీకరణ చేశానని, జాన్వీని తనకు దానంగా ఇవ్వడం తప్పితే వేరే మార్గం లేదని ప్రాక్టికల్ గా కొన్ని చర్యలతో సహా చూపిస్తాడు. తర్వాత ఏం జరిగింది? అసలు ఈ వనరాజ్ ఎవరు? ఎందుకు జాన్వీని వశీకరణ చేశాడు? వనరాజ్ కారణంగా కబీర్ కుటుంబం ఎలాంటి సమస్యలని ఎదురుకుంది? చివరికి వనరాజ్ నుంచి జాన్వీకి విముక్తి లభించిందా లేదా? అనేది తక్కిన కథ.

సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా వశీకరణ ఏమిటని తేలిగ్గా తీసిపారేయొచ్చు. కానీ నమ్మశక్యం కాని పాయింట్ ని కూడా నమ్మించేలా తీయగల నేర్పు దర్శకుడిలో వుంటే ఆ పాయింట్ ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబడుతుంది. దర్శకుడు వికాశ్‌భల్‌ ఈ విషయంలో మంచి నేర్పుని కనబరిచాడు. కబీర్‌ కుటుంబాన్ని పరిచయం చేస్తూ ఓ ఫ్యామిలీ స్టోరీలానే సినిమా నెమ్మదిగా మొదలౌతుంది. ఎప్పుడైతే దాబాలో వనరాజ్, కబీర్ కుటుంబానికి ఎదురుపడ్డాడో అక్కడి నుంచి ప్రేక్షకుడిలో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఏదైనా తినే వస్తువు ఇచ్చి వశీకరణ చేయొచ్చని సాధారణంగా వింటుంటాం. ఇందులో కూడా అదే ఫాలో అయ్యారు. కానీ ఆ సన్నివేశాన్ని చాలా షార్ఫ్ గా మంచి పెర్ఫార్మెన్స్ లతో ఎక్కడా రొటీన్ అనిపించకుండా తీయగలిగారు. వనరాజ్, కబీర్ ఫాంహౌస్ లోకి వచ్చిన తర్వాత జరిగే సన్నివేశాలు టెర్రిఫిక్ గా వుంటాయి. దెయ్యాలు, ఆత్మలు, సడన్ సౌండ్ ఎఫెక్ట్స్ వుండవు. కానీ వాటి కంటే డబుల్ ఇంపాక్ట్ ఇచ్చేలా వశీకరణను వాడుకున్న విధానం కొత్తగా వుంటుంది. కేవలం మాటల‌తోనే జాన్వీని తనకు నచ్చినట్లు ఆడిస్తుంటాడు వనరాజ్. తెరపై జరుగుతున్న సన్నివేశాలన్నీ చూస్తున్నపుడు .. నిజంగా వనరాజ్ వశీకరణ నుంచి ఆ పాపకు ఎలా విముక్తి దొరుకుతుందనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కూడా కలుగుతుంది.

అయితే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథలో పట్టుతప్పింది. తొలి సగంలో సన్నివేశాలు ఎంత చరుగ్గా ఆసక్తికరంగా సాగాయో ద్వితీయార్ధంలో అంత‌గా నెమ్మదిస్తాయి. వనరాజ్ చర్యలన్నీ రిపీట్ గా అనిపిస్తాయి. అందులో భయపెట్టే ఎలిమెంట్ కంటే హింస ఎక్కువైపోయింది. తొలిసగంలోని ప‌దును రెండోసగం లోపించింది. నిజానికి ఇంలాంటి కథలకు ఒక ఫాష్ బ్యాక్ వుంటుంది. అలాగే వశీకరణ విరుగుడు కోసం మరో మాంత్రికుడిని ఆశ్రయించే సన్నివేశాలు వుంటాయి. సైతాన్ లో మాత్రం ఆ ట్రీట్ మెంట్ కనిపించదు. ఇది కొంత కొత్తదనం తీసుకొచ్చినప్పటికీ సన్నివేశాలన్నీ అక్కడక్కడే తిప్పుతూ హింసని హైలెట్ చేస్తూ కథనం నడిపిన తీరు మాత్రం అంత రుచించదు. క్లైమాక్స్ లో సినిమా మళ్ళీ పుంజుకుంటుంది. తన కూతురిని కాపాడటం కోసం కబీర్ వేసిన ఎత్తుగడ మెప్పిస్తుంది. తన మాటతో జాన్వీని వశం చేసుకున్న వనరాజ్ ని అదే మాటతో విముక్తి కలిగిస్తాడు కబీర్. అది ఎలా అనేది తెరపైనే చూడాలి.

దృశ్యం తర్వాత ఫ్యామిలీని రక్షించే తండ్రి పాత్రలు అజయ్‌ దేవగణ్ కు బాగా కలిసొస్తున్నాయి. కబీర్ కూడా లాంటి ఓ ఫ్యామిలీ మ్యాన్ పాత్రే. దృశ్యంలో క్రైమ్ నుంచి కాపాడితే.. ఇందులో తన కూతురిని వశీకరణ నుంచి విముక్తి చేసేపాత్రలో కనిపిస్తాడు. కబీర్ పాత్రలో సహజంగా ఒదిగిన తీరు బావుంది. కూతురికి ఏమైపొతుందో అని ఓ తండ్రి పడే భయం, ఆవేదన ఆయన నటనలో కనిపించాయి. జ్యోతిక పాత్ర కూడా హుందాగా కథకు అనుగుణంగా వుంది. వనరాజ్ తో తలపడే ఓ సన్నివేశంలో కూతురు కోసం ఎంతకైనా తెగించే తల్లి కనిపిస్తుంది. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ వనరాజ్ పాత్రలో ఒదిగిపోయిన ఆర్‌.మాధవన్‌. నిజంగా అతని ఉనికి భయం పుట్టిస్తుంటుంది. మాటలతోనే వణుకు పుట్టించే పాత్ర చేశాడు. క్లైమాక్స్ అతని గెటప్ చూస్తున్నపుడు.. అసలు ఇతను లవర్ బాయ్ మ్యాడీనేనా?! అనే అనుమానం కలిగించేలా వుంటుంది. కబీర్‌ కుమార్తెగా జాన్వీ పాత్రలో జాంకీ బొదివాలా నటన మరో ఆకర్షణ. వష్ సినిమాలో కూడా ఆ పాత్రనే ఆమెనే చేసింది.

అమిత్ త్రివేది అందించిన నేపథ్య‌ సంగీతం ఎఫెక్టివ్ గానే వుంది. సుధాకర్ రెడ్డి కెమరాపనితనం ఈ జోనర్ ని మ్యాచ్ చేసింది. కథకు సరిపడా నిర్మాణ విలువలు వున్నాయి. ఒక్క రాత్రిలో జరిగే కథ ఇది. ప్రీ క్లైమాక్స్ వరకూ సినిమా ఒక ఫాంహౌస్ లోనే జరిగిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో వుంటే పట్టు సెకండ్ హాఫ్ లో లేకపోవడం వలన కథ ఒకేచోట జరుగుతుందనే ఫీలింగ్ వస్తుంది. వశీకరణ నేపధ్యంలో సినిమాలు వచ్చి చాలా కాలమైయింది. నిజంగా అలాంటి బ్లాక్ మ్యాజిక్ విద్యలు ఉన్నాయా లేదా? అనే ప్రశ్నలు పక్కన పెడితే.. ఎవరైనా అపరిచితులు ఏదైనా తినడానికి ఇచ్చినపుడు దాన్ని ముట్టుకోవాలంటే భయపెట్టేలా వుంటుందీ సినిమా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close