అవును నేను పశుపతినే : చంద్రబాబు

చంద్రబాబు పశుపతి అనే అర్థంలో పసుపుపతి అంటూ వ్యాఖ్యానించి ఆయనకు ఓటు వేయవద్దు అంటూ జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కోనసీమలో ప్రజాగళం సభలలో తాను పశుపతిని అన్న జగన్ తాను అంగీకరిస్తున్నా అన్నారు. పశుపతి అంటే శివుడని.. ప్రపంచాన్ని కాపాడిన దేవుడని అన్నారు. తనపై.. తన కుటుంబంపై దాడి చేశారని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. తాను కూడా పశుపతి మాదిరిగానే రాష్ట్రాన్ని రక్షించుకుంటానన్నారు.

“నన్ను పశుపతి అనడాన్ని అంగీకరిస్తున్నా… ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషాన్ని కూడా గొంతులో పెట్టుకున్నాడు. ఐదేళ్లుగా మీరు చూస్తున్నారు… నన్ను అనేక మాటలు అన్నారు, మిత్రుడు పవన్ కల్యాణ్ ను అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ భరించాను, ఎన్నో అవమానాలు పడ్డాను. కానీ ఒకే పట్టుదల, ఒకే ఆలోచన… మళ్లీ తెలుగుజాతిని కాపాడుకోవాలి. ప్రజలను చైతన్యపరిచేందుకు తాను ప్రజాగళం చేపడితే, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూసి నేనే చైతన్యవంతుడ్ని అవుతున్నా” అని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రశాంతతకు మారుపేరు కోనసీమ అని, గతంలో ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా? అని ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని, కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులతో ఏపీలో అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మళ్లీ నిలబడాలి, రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్న ఉద్దేశంతో మేం ముగ్గురం కలిసి మీ ముందుకు వచ్చాం అని చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారు.

పశుపతి అనే పేరు ఓ సినిమాలో విలన్‌కు పెట్టారని మిడి మిడి జ్ఞానంతో రచయితలు రాసిచ్చే స్క్రిప్టులను జగన్ మోహన్ రెడ్డి ప్రాసలు కలిసి వస్తున్నాయి కదా అని చదివేస్తున్నారు. ఆయనకు వాటికి అర్థం కూడా తెలియదు. పదాలను కూడా తప్పుగా చదువుతూంటారు. ఇలాంటి స్క్రిప్టులు రాసి.. మరింతగా ఆయనను రైటర్లు నవ్వుల పాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

పల్నాడులో కీల‌క ప‌రిణామం- అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్

హింసాత్మక ఘటనలతో విధ్వంసకాండ కొనసాగుతోన్న పల్నాడు జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్ళారు. గురువారం గృహ నిర్బంధంలోనున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాత్రి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close