ఎక్స్‌క్లూజీవ్‌: నందీశ్వ‌రుడిగా ప్ర‌భాస్‌

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘క‌న్న‌ప్ప‌’లో ప్ర‌భాస్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ ఈ సినిమాలో ఏ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌న్న సందేహం అంద‌రిలోనూ ఉంది. ప్ర‌భాస్ ప‌ర‌మ‌శివుడుగా ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని అనుకొన్నారు. అలానే ప్ర‌చారం జ‌రుగుతోంది కూడాజ‌ అయితే.. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ప్ర‌భాస్ నందీశ్వ‌రుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. నిజానికి శివుడి పాత్ర చేయాల‌ని మంచు విష్ణు ఒత్తిడి చేశాడ‌ని, ప్ర‌భాస్ ఆ భారం మోయ‌ద‌ల‌చుకోలేద‌ని, సున్నితంగా ఆ ఆఫ‌ర్ తిర‌స్క‌రించాడ‌ని, చివ‌రికి నందీశ్వ‌రుడిగా క‌నిపించ‌డానికి ఒప్పుకొన్నాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

శివుడి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌. మంచు మోహ‌న్ బాబు, బ్ర‌హ్మ‌నందం కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. న్యూజీలాండ్ లో ఓ కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకొంది. ‘క‌ల్కి’ షూటింగ్ హ‌డావుడి పూర్త‌యిన వెంట‌నే ప్ర‌భాస్ ‘క‌న్న‌ప్ప‌’కు కాల్షీట్లు కేటాయిస్తాడ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close