పార్లమెంటులో ప్రశ్నలు…ఆమెకు వెన్నతో పెట్టిన విద్య – విశాఖ ఎంపీ అభ్యర్థి ఝాన్సీలక్ష్మీ

పార్లమెంటులో ప్రశ్నలు వేయడమంటే, ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడ సమస్య ఉంటే, అక్కడ బొత్సా ఝాన్సీ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన నిజం. ఇది నా ఎంపీ పరిధిలోని సమస్య, ఇదే మాట్లాడాలని అనుకోరు. దేశంలోని ఏ సమస్యయినా సరే ధైర్యంగా పార్లమెంట్ లో ప్రశ్నిస్తారు. దానికి జవాబు తీసుకుంటారు. అలా ఉత్తరాంధ్ర సమస్యలన్నిటిని ఎలుగెత్తి పార్లమెంటులో ప్రస్తావించిన ఏకైక మహిళ ఎవరంటే బొత్సా ఝూన్సీ అని చెప్పాలి.

అక్కడితో ఆగిపోరు. దానిని ఫాలో అప్ చేస్తారు. ఆ ప్రశ్న, ఆ మంత్రిగారిచ్చిన జవాబు కాపీ పట్టుకుని సంబంధిత శాఖ వద్దకు వెళతారు. అక్కడ అధికారులను కలుసుకుంటారు. వారికి చూపిస్తారు. రికార్డులు చూస్తారు. దాని ప్రోసెస్ ని అమెజాన్ లో ఆర్డర్ పెట్టిన వస్తువు ఎంత దూరం వచ్చిందో, ఎలా చూస్తామో అలా అన్నీ చూసుకుంటారు.జాగ్రత్తగా తన నోట్స్ లో రాసుకుంటారు.

ఓకే కొంచెం మూమెంట్ ఉందంటే వచ్చేస్తారు. అస్సలు కదల్లేదంటే సంబంధిత కేంద్ర మంత్రి అపాయింట్ మెంట్ తీసుకుంటారు. అక్కడికి వెళతారు. ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఆయన్ని కలుస్తారు. ఆయన దగ్గర హామీ తీసుకుంటారు. ఢిల్లీ వెళ్లారంటే బొత్సా ఝాన్సీ పనేంటయ్యా అంటే…తను సంధించిన ప్రశ్నల తాలూకూ ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకోవడమేనని తెలిసినవారంటూ ఉంటారు.

అందుకు ఆమె ఏమంటారంటే, ఏదో మొక్కుబడిగా అడిగి, అంతటితో మన పనైపోయిందని ఎలా అనుకుంటాం? ప్రజాసేవ చేయడానికి వచ్చాం. కనీసం ప్రజల సమస్యలను దేశం పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది కదా అని తిరిగి మనల్నే ప్రశ్నిస్తారు. ఇదే కదా…మనం చేయాల్సిందని అంటారు.

మరి పార్లమెంటులో ప్రశ్నిస్తే సరిపోయిందా? అని ఎవరన్నా అడిగితే ఆమె చక్కగా సమాధానం చెబుతారు. ఒక్కసారి మనం వేసిన ప్రశ్న పార్లమెంటులో రికార్డ్ అయితే, వందేళ్లయినా అలాగే ఉంటుంది. అది పరిష్కారమైందని చెబితేనే, దాన్ని రికార్డ్స్ నుంచి పక్కన పెడతారు. లేదంటే అదక్కడ సజీవంగానే ఉంటుందని అంటారు.

అందుకనే జీరో అవర్ కి చాలా డిమాండ్ ఉంటుంది. అక్కడ మన ప్రశ్న రావాలంటే దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అల్లాటప్పా ప్రశ్నలు పట్టుకుని మనం వెళ్లి అడగకూడదు. నువ్వు అడిగే ప్రశ్న, దాని తీవ్రతను బట్టే, నీకున్న అవగాహనను బట్టి, పార్లమెంటు సమావేశాల్లో అవకాశం ఇస్తారని అంటుంటారు

బొత్సా ఝాన్సీ పార్లమెంటులో ప్రశ్నించారంటే, దానికి పరిష్కారం తప్పక దొరుకుతుందని అంటారు. లేదంటే అందులోని సాధక బాధకాలను అధికారులు లేదా కేంద్రమంతులు ఆమెకు వివరిస్తారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కూడా ఉంటే, ఆ మార్గం కూడా చెబుతారు. అందుకే ఆమెకు ఉత్తమ పార్లమెంటేరియన్ గా సంసద్ రత్న అవార్డు వచ్చింది. ఇదే నిదర్శనమని అందరూ అంటుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

జగన్‌కు పీకే నాడు గెలిపించేవాడు – నేడు నథింగ్ !

ప్రశాంత్ కిషోర్ నథింగ్ అని ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ పలికిన మాటలకు అక్కడ ఉన్న భారీ ప్యాకేజీలు అందుకుని తూ..తూ మంత్రంగా పని చేసిన రిషిరాజ్ టీం చప్పట్లు కొట్టి ఉండవచ్చు...
video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close