బెంగ‌ళూరుపై ‘సన్ రైజింగ్‌’… ఐపీఎల్ లో స‌రికొత్త రికార్డ్‌!

ఐపీఎల్‌లో త‌న రికార్డుని తానే బ‌ద్ద‌లు కొట్టుంది హైద‌రాబాద్ జ‌ట్టు. ముంబైపై కొన్ని రోజుల క్రింద‌ట నెల‌కొల్పిన అత్య‌ధిక ప‌రుగుల రికార్డుని ఇప్పుడు బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో చెరిపివేసింది. 287 ప‌రుగుల భారీ స్కోరు సాధించి, చ‌రిత్ర సృష్టించింది. ఈ సీజ‌న్‌లోనే ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ 277 ల స్కోరు సాధించింది. ఆ స్కోరు దాట‌డం ఇప్ప‌ట్లో ఏ జ‌ట్టుకీ సాధ్యం కాదు అనుకొనే లోప‌లే, ఆ రికార్డుని స్వ‌యంగా బ‌ద్ద‌లు కొట్టింది.

ఈరోజు చిన‌స్వామి స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగాచెల‌రేగారు. హెడ్ (102), క్లాసన్ (67), అభిషేక్ (34), మార్‌క్ర‌మ్ (32 నాటౌట్‌), స‌మ‌ద్ (37 నాటౌట్‌) ప‌రుగుల‌తో బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టారు. హైద‌రాబాద్ బ్యాట‌ర్లు ఏకంగా 22 సిక్సులు బాదారు. బ్యాటింగ్ కి దిగిన ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం 2 సిక్సులు కొట్ట‌డం విశేషం. ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో ప‌రుగులు కాస్త నెమ్మ‌దించాయి. లేదంటే 300 ప‌రుగుల మైలు రాయిని అందుకొనేదే. ఈ సీజ‌న్‌లో 300 స్కోరు చూసినా ఆశ్చ‌ర్యం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close