విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్ సినిమాని మార్కెటింగ్ చేసిన స్థాయిలో త‌న చిత్రాన్ని జ‌నంమ‌ధ్య‌లోకి తీసుకెళ్లాడు రాజ‌మౌళి. ఓ సినిమాకు ఇలాక్కూడా ప‌బ్లిసిటీ చేయొచ్చా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇప్పుడు ఆ అడుగుజాడ‌ల్లోనే మిగిలిన వాళ్లు న‌డుస్తున్నారు. మంచు విష్ణు కూడా ప్ర‌మోష‌న్ ప‌రంగా రాజ‌మౌళినే ఫాలో అవుతున్నాడు.

విష్ణు త‌న కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం.. `క‌న్న‌ప్ప‌`. ఇప్ప‌టికే ఈసినిమాని స్టార్ల‌తో నింపేసి, ఫోక‌స్ పెంచాడు. ప్ర‌మోష‌న్స్ కూడా వినూత్నంగా చేసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. `క‌న్న‌ప్ప‌` పై ఓ పుస్త‌కాన్ని ప్రింట్ చేయించాడు విష్ణు. 16 పేజీల గ‌ల ఈ ఫ‌స్ట్ వాల్యూమ్‌లో భ‌క్త కన్న‌ప్ప‌కు సంబంధించిన అన్ని విష‌యాల్నీ పొందుప‌రిచారు. ఈ పుస్త‌కాన్ని అన్ని భాష‌ల్లోనూ అనువ‌దించి, స్థానికంగా క‌న్న‌ప్ప విశేషాలు తెలిసేలా చేస్తారు. అలా.. ఈ సినిమాకు వ‌చ్చేవాళ్ల‌కు క‌న్న‌ప్ప‌పై ఓ స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న వ‌స్తుంది. ఇదీ…. విష్ణు స్ట్రాట‌జీ. దీంతో పాటుగా క‌న్న‌ప్ప‌లోని న‌టీన‌టుల‌కు సంబంధించిన యానిమేష‌న్ చిత్రాలు కూడా రూపొందించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close