వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా… అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత సంచ‌ల‌నంగా మారింది…?

1996, డిసెంబ‌ర్ 29న వెంక‌టాయ‌పాలెంలో ఈ శిరోముండ‌నం జ‌రిగింది. ఆనాడు ఎన్నిక‌ల్లో తోట త్రిమూర్తులు వ‌ర్గం బూత్ లో రిగ్గింగ్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే, అడ్డుకున్నందుకు త‌మ‌పై కోపం పెట్టుకొని తోట త్రిమూర్తులు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఐదుగురిని హింసించి, ఇద్ద‌రికి గుండు కొట్టించి… క‌నుబొమ్మ‌లు గీయించార‌ని కేసు న‌మోదైంది.

1994లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తోట త్రిమూర్తులు రామ‌చంద్రాపురం ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో బీఎస్సీ త‌ర‌ఫున పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న ఇద్దరితో తోట త్రిమూర్తులు కుటుంబ స‌భ్యుల‌కు వాగ్వాదం జరిగింది. బూత్ లోకి చొర‌బ‌డి రిగ్గింగ్ చేయాల‌ని భావిస్తే, తాము అడ్డుకున్నామ‌ని ఆ బాధితులు పేర్కొన్నారు. ఆ క‌క్ష‌తోనే త‌మ‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించార‌ని, 1996 డిసెంబ‌ర్ లో శిరోముండ‌నం చేశార‌ని బాధితులు ఆరోప‌ణ‌.

నిజానికి ఈ కేసులో 2015లోనే తీర్పు రావాల్సి ఉన్న‌ప్ప‌టికీ, తాము అస‌లు ద‌ళితుల‌మే కాద‌ని… మ‌తం మార్చుకున్నామ‌ని కొత్త వాద‌నను తోట త్రిమూర్తులు తెచ్చార‌ని, ఆల‌స్యం అయినా త‌మ‌కు న్యాయం జ‌రిగింద‌ని బాధితులు మీడియాకు వివ‌రించారు.

అయితే, ఇది రెండు సంవ‌త్స‌రాల క‌న్నా త‌క్కువ జైలు శిక్ష ప‌డ్డ కేసు కావ‌టంతో తోట త్రిమూర్తులు ఎన్నిక‌ల్లో పోటీ చేసుకునే అవ‌కాశం ఉంది. దీనిపై అప్పీల్ కు వెళ్లి, శిక్ష‌పై స్టే తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close