దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని రూపుమాపామని, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియాతో ఎంతో ప్రగతి సాధించామంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

దేశంలో నాణ్యమైన ఆహరం దొరక్క ఏడాదికి 17 లక్షల మంది చనిపోతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ…భారత్ ను నిరుద్యోగ భారతవనిగా మార్చారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 30లక్షల ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఏమాత్రం కేంద్రం ఆసక్తి చూపడం లేదు.

ఫలితంగా పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్ కన్నా దారుణమైన నిరుద్యోగం రేటు భారత్ లో ఉన్నది. దేశంలో 22.32శాతం నిరుద్యోగ రేటు ఉన్నది. నేషనల్ క్రైం రికార్డ్స్ ప్రకారం.. 2014లో నిరుద్యోగుల ఆత్మహత్యల శాతం 7.5గా ఉంటే 2023 నాటికి 10 శాతాన్ని మించిపోయింది. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక 5 లక్షల చిన్న, మధ్య తరహ పరిశ్రమలు మూతపడగా, లక్షలాది మంది ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళారు.

ఇండియాలో వైద్యరంగం పెద్ద బిజినెస్ గా మారడం పేదలకు శాపంగా మారింది. ఫలితంగా ఎంతోమంది పేదలు సరైన వైద్యం అందక చనిపోతున్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం.. వైద్య సదుపాయాల మీద జాతీయాదాయంలో ఖర్చు పెడుతున్నది కేవలం 1% మాత్రమే కావడం గమనార్హం.

ఏటా యూఎన్ డీపీ మనవాభివృద్ది సూచీ (హెచ్ డీ ఐ ) నివేదికను బహిర్గతం చేస్తుంటుంది. 2015లో 188 దేశాల్లో ఇండియా ర్యాంక్ 130ఉండగా… 2022 -23 నాటికీ 132ర్యాంక్ కు చేరిందంటే.. పదేళ్ళ బీజేపీ పాలనలో ఏం అభివృద్ధి జరిగినట్లు..? పని తక్కువ… ప్రచారం ఎక్కువ చేసుకోవడంతోనే ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close