కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా ఆనవాళ్ళు ఉన్నాయి.ఎర్రని బట్టలు, బొమ్మ , పసుపు కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలు ఉండటంతో భయానకమైన పరిస్థితి కనిపిస్తోంది.అర్దరాత్రి ఈ క్షుద్ర పూజలు చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు.

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు జరగడం చర్చనీయాంశం అవుతోంది. ఎవరు క్షుద్రపూజలు చేశారు..? ఎవరిని టార్గెట్ చేసేందుకు ఈ పూజలు జరిపారు..? దీని వెనక ఎవరైనా ఉన్నారా..? రాజకీయ దురుద్దేశ్యంతోనే ఈ క్షుద్రపూజలకు పాల్పడ్డారా..? అనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది.

కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలకు వేదిక చేసుకోవడం సంచలనంగా మారింది. కేసీఆర్ ఫ్యామిలీని ఆందోళనకు గురి చేసేందుకే ఇలాంటి ఏమైనా ప్లాన్ చేశారా..? అనే అనుమానాలను బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సెంటిమెంట్లను ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే ఆయన్ను మరింత ఒత్తిడిలోకి నెట్టేసేందుకు ఇలాంటి వాటికి తెరతీశారా..? అనే కోణంలో చర్చలైతే జరుగుతున్నాయి.

ఈ క్షుద్రపూజల పై ఇప్పటివరకు కేసీఆర్ ఫ్యామిలీ స్పందించలేదు కానీ బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఆందోళన చెందుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close