నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం విక్ర‌మ్‌కు అల‌వాటు. పైగా గెట‌ప్పుల పిచ్చి ఎక్కువ‌. ప్ర‌తీ సినిమాలోనూ నాలుగైదు గెట‌ప్పులు ట్రై చేస్తుంటాడు. దాంతో.. విక్ర‌మ్ సినిమాలు అటు క‌మ‌ర్షియ‌ల్ సెట‌ప్పుల‌కు, ఇటు ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కూ కాకుండా పోతున్నాయి. త‌న త‌ప్పుల్ని విక్రమ్ ఈసారి గ‌ట్టిగా ప‌సిగ‌ట్టు ఉన్నాడు. మంచి మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌లో సినిమాని ఎంచుకొన్నాడు. అదే.. ‘వీర ధీర శూర‌న్‌’.

అరుణ్ కుమార్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ఎస్‌.జె.సూర్య కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. చియాన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ రోజు టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ అంటే టీజ‌ర్ కాదు, సినిమాలోని ఓ సీన్‌ని డైరెక్టుగా వ‌దిలేశారు. ఈ సీన్‌తోనే హీరోయిజం పూర్తి స్థాయిలో ఎలివేట్ అయిపోయింది. సీన్ చూస్తే.. విక్ర‌మ్ చాలా కాలం త‌ర‌వాత నేల దిగి.. త‌న నుంచి అభిమానులు ఏం కోరుకొంటున్నారో, అలాంటి క‌థ ఎంచుకొన్నాడ‌నిపిస్తోంది. విక్ర‌మ్‌, ఖైదీ వైబ్స్ టీజ‌ర్లో క‌నిపిస్తున్నాయి. జి.వి.ప్ర‌కాష్ కుమార్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్‌ని మ‌రింత‌గా ఎలివేట్ చేసింది. సినిమాలో ఏదో విష‌యం ఉంద‌న్న సంగ‌తి… ఈ చిన్న సీన్ చూస్తేనే అర్థ‌మైపోతోంది. చాలా కాలంగా విక్ర‌మ్ ని ఊరిస్తున్న మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ ఈ సినిమాతో ద‌క్కుతుంద‌న్న న‌మ్మ‌కం క‌లుగుతోంది. విక్ర‌మ్ న‌టిస్తున్న 62వ చిత్ర‌మిది. తెలుగులోనూ అదే పేరుతో విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close