మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి… ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ ఇప్ప‌టికే 7 రాష్ట్రాల పీసీసీలు కోరిన‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే కేర‌ళ‌లో ప‌ర్య‌టిస్తున్న రేవంత్ రెండ్రోజుల పాటు అక్క‌డే క్యాంపెయిన్ చేస్తున్నారు. కేర‌ళ‌తో పాటు ఏపీలోనూ ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల కోరిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే యూపీ, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్రల నుండి కూడా ఇన్విటేష‌న్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని జాతీయస్థాయిలో రేవంత్ రెడ్డి పేరును స్టార్ క్యాంపెయిన‌ర్ లిస్టులో చేర్చి, అనుమ‌తులు తీసుకుంటోంది ఏఐసీసీ.

ఇక ఇత‌ర రాష్ట్రాల‌తో పాటు తెలంగాణ‌లోనూ రోజుకు రెండు లోక్ స‌భ సీట్ల‌లో బ‌హిరంగ స‌భ‌ల‌తో పాటు రోడ్ షోలు నిర్వ‌హించేలా ప్లానింగ్ న‌డుస్తోంది. మొత్తం 50 స‌భ‌ల్లో రేవంత్ రెడ్డి పాల్గొనే అవ‌కాశం క‌నిపిస్తుంది. రూర‌ల్ ఏరియాల్లో భారీ బ‌హిరంగ స‌భ‌లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రోడ్ షోల‌కు ప్రాధాన్యం ఇస్తూ రూట్ మ్యాప్ ఖ‌రారు అవుతోంది. తెలంగాణ‌లో ప్ర‌తి లోక్ స‌భ స్థానానికి క‌నీసం రెండు సార్లు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

19వ తేదీ నుండి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్నిక‌ల ప్రచారం షురూ చేయ‌బోతున్నారు. బీఆర్ఎస్ నుండి కేసీఆర్ రోడ్ షోలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో… గురువారం కేసీఆర్ రూట్ మ్యాప్ ఖ‌రారు కాబోతుంది. దానికి కౌంట‌ర్ గా రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ ఉండబోతున్న‌ట్లు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close