కోదండరామ్ ఆవేదన సహేతుకమే కానీ…

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత, తెలంగాణా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన తెలంగాణా జె.ఏ.సి. చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్ కి తెరాస ప్రభుత్వం అపూర్వమయిన గౌరవమర్యాదలు అందిస్తుందని అందరూ భావించారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కన పడేశారు. ఈ 22 నెలల కాలంలో కనీసం ఆయనను జ్ఞాపకం చేసుకొన్న దాఖలాలు కూడా లేవు.

అంతటి వాడినే పట్టించుకోని తెరాస ప్రభుత్వం, ఒకప్పుడు తెలంగాణా కోసం పోరాడిన మహేందర్ రెడ్డి అనే ఉద్యమకారుడు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే పట్టించుకొంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది. మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ “తెరాస ప్రభుత్వంలో ఉద్యమకారులకు చోటు లేకుండాపోయిందని, వారికి చోటు కల్పించకపోగా, వారిని అణచివేసిన వారికే పదవులు, అధికారం కట్టబెడుతున్నారని” ఆవేదన వ్యక్తం చేసారు.

ఆయన ఆవేదన సహేతుకమే కానీ ఇపుడు తెరాస ఒకనాటి తెరాస కాదని, కేసీఆర్ ఆనాటి కేసీఆర్ కాదనే చేదు నిజం జీర్ణించుకోక తప్పదు. ఒకప్పుడు తెరాస అంటే తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించడానికి సైతం వెనుకాడని వేలాది మంది కార్యకర్తలే గుర్తుకు వచ్చేరు. కానీ అదిప్పుడు దేశముదురు కాంగ్రెస్, తెదేపా నేతలతో నిండిపోయింది. వారిలో ఏనాడు తెలంగాణా కోసం ఉద్యమించని వారు పదవులు, అధికారం అనుభవిస్తున్నారు. అందుకు వారిని తప్పు పట్టలేము. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఆలోచనా తీరులో వచ్చిన మార్పు కారణంగానే వారందరూ పార్టీలోకి, ప్రభుత్వంలోకి వచ్చి చేరారు.

ఒకప్పుడు తెలంగాణా సాధనే తన జీవిత ద్యేయం అని పలికే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణాలో తెరాసకు ఎదురులేకుండా చేసుకోవడమే ధ్యేయంగా మార్చుకొని ఆ ప్రకారం అన్ని పార్టీల నేతలను తెరాసలో చేర్చుకొంటున్నారు. దానికి ఆయన ఒక అందమయిన పేరు కూడా పెట్టుకొన్నారు. అదే రాజకీయ ఏకీకరణ. దానికి ఒక బలమయిన కారణం కూడా చెప్పుకొన్నారు. అదే ‘బంగారి తెలంగాణా సాధన.’

అయితే తెలంగాణా కోసం తమ సర్వస్వం ధారపోసి పోరాడిన వారితో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొంటే బంగారి తెలంగాణాను నిర్మించుకోవడం సాధ్యం కాదా? అంటే నిజానికి వారయితేనే నిండు మనసుతో, నిబద్దతతో బంగారి తెలంగాణా కోసం కృషి చేస్తారని చెప్పవచ్చును. వారికి తెలంగాణా కోసం కష్టపడటం మాత్రమే తెలుసు తప్ప తెరాసకు సవాలు విసురుతున్న ప్రతిపక్ష పార్టీలను నిలువరించడం తెలియదు కనుక కేసీఆర్ వారందరినీ పక్కన పెట్టేసి, తమ పార్టీకి సవాలు విసురుతున్న ప్రతిపక్ష పార్టీల నుండే నేతలను తెరాసలోకి దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఆవిధంగా చేయడం వలన ఇక తెలంగాణాలో తెరాసకు సవాలు విసిరేవాళ్ళుండరు..తన అధికారాన్ని ప్రశ్నించేవాళ్ళు అసలే ఉండరు.

అయితే ఈ వ్యూహాలు, ఆలోచనలు అన్నీ బంగారి తెలంగాణా సాధన కోసమేనని ఆయన చెప్పుకొంటుంటారు. రాష్ట్రాభివృద్ధి చేసి తెలంగాణాను దేశంలో అగ్రస్థానంలో నిలపాలనే కేసీఆర్ ఆశయాన్ని శంఖించడానికి లేదు కానీ దాని కోసం ఆయన ఎంచుకొన్న మార్గం, అనుసరిస్తున్న వ్యూహాలే తెలంగాణా కోసం పోరాడినవారు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సుస్థిర అధికారం చాలా ముఖ్యమే కానీ అధికారమే పరమావధిగా చేసుకొని ముందుకు సాగుతూ, తెలంగాణా కోసం పోరాడిన వారిని మరిచిపోవడమే పెద్ద తప్పు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ...

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close