పవన్‌ విషయంలో పార్టీఎంపీలకు బాబు సూచన

హైదరాబాద్: తెలుగుదేశానికి మిత్రుడైన పవన్ కల్యాణ్ మాటలను హితవుగానే తీసుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ ఎంపీలకు సూచించారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో సీమాంధ్ర ఎంపిలు ఏంచేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ ఇటీవల తీవ్రమైన వ్యాఖ్యలతో నిలదీసిన విషయం తెలిసిందే. దానిపై విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ళ నారాయణ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈవిషయం నిన్న విజయవాడలో జరిగిన తెలుగుదేశం ఎంపిల సమావేశంలో ప్రస్తావనకొచ్చినపుడు బాబు పైవిధంగా స్పందించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వటానికి రికార్డుల పరంగా అవసరమైన ఆధారాలు, వనరుల క్రోడీకరణ పని శాఖలవారీగా మొదలైందని ఇప్పటికే 60 శాతం పని జరిగిందని అధికారుల సమాచారాన్ని కోట్ చేస్తూ మంత్రి సుజనా చౌదరి నిన్న సమావేశంలో వివరించినట్లు సమాచారం. ఇంకో నెలన్నరలో ప్రత్యేకహోదాపై పూర్తి ఫైలు సిద్ధమౌతుందన్నారని తెలిసింది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close