ఇది 9రోజుల్లో 300 కోట్లు, అది 3రోజుల్లో 100 కోట్లు,

హైదరాబాద్: బాక్సాఫీస్‌వద్ద బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాల ప్రభంజనం కొనసాగుతోంది. బాహుబలి తొమ్మిది రోజుల్లో రు.300 కోట్లు కొల్లగొట్టగా, సల్మాన్ ఖాన్ చిత్రం భజరంగీ భాయ్‌జాన్ మొదటి వారాంతానికే మూడురోజుల్లో రు.100 కోట్ల మైలురాయిని దాటింది. బాలీవుడ్‌లో వందకోట్ల మైలురాయిని ఇంత తక్కువకాలంలో అధిగమించిన చిత్రం ఇంతకుముందు మరేదీలేకపోవటం విశేషం. ఆమీర్ ఖాన్ చిత్రం పీకే, షారుక్ ఖాన్ చిత్రం హ్యాపీ న్యూ ఇయర్ మొదటి వారాంతానికి వందకోట్ల మైలురాయిని కొద్దిలో మిస్ అయ్యాయి. మరోవైపు సల్మాన్‌కు వందకోట్లు దాటిన చిత్రాలు భజరంగీతో ఎనిమిదయ్యాయి. ఈ ఘనతకూడా బాలీవుడ్‌లో మరెవరికీ లేదు. సల్మాన్ తదుపరి చిత్రం సూరజ్ బర్జాత్యా(హమ్ ఆప్‌కేహై కౌన్, మైనే ప్యార్ కియా)దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రేమ్ రతన్ ధన్ పాయో అనే ఈ చిత్రం దీపావళికి విడుదలయ్యే అవకాశాలున్నాయి.

మరోవైపు బాహుబలి హవా కొనసాగుతోంది. తొమ్మిదిరోజుల్లో రు.303 కోట్లను వసూలుచేసింది. రజనీకాంత్ బ్లాక్ బస్టర్ రోబో మొత్తం మీద సాధించిన రు.290 కోట్లను ఇది తొమ్మిదిరోజుల్లో అధిగమించటం విశేషం. అయితే సల్మాన్ ఖాన్ చిత్రం భజరంగీ భాయ్‌జాన్ విడదల ప్రభావంతో పదవరోజున కలెక్షన్లు కొద్దిగా తగ్గాయి. ఒక దక్షిణాది చిత్రం రు.300 కోట్ల మైలురాయిని అధిగమించటం ఇదే ప్రథమం. పూర్తి రన్‌లో ఇది ఎంత సాధిస్తుందో ఊహకందటంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close