తెలకపల్లి వ్యూస్ : టార్గెట్‌.. బుల్లెట్‌.. రిజల్ట్‌ ..సేమ్‌ టు సేమేనా?

ఒక టార్గెట్‌ను ఛేదించేందుకు పేల్చిన బుల్లెట్లు వ్యర్థమైన తర్వాత కూడా అదే పని అలాగే చేయడంలో అర్థమేమిటి? ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీలో జగన్‌ నాయకత్వంలోని వైసీపీ పరిస్థితి అలాగే వుంది. ఆ పార్టీనుంచి ఎనిమిది మంది ఎంఎల్‌ఎలను తెలుగుదేశం చేర్చుకోవడం రాజకీయ నైతికత కాదన్నది నిజం. వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని అడగడం న్యాయం. గతంలో చాలా చోట్ల జరిగింది గాని ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో జరుగుతున్నది కూడా ఫిరాయింపులను యథాతథంగా అనుమతించడమే గనక ఇది కొత్తేమీ కాదు. అయినా విప్‌ జారీ చేసి వారిని ఇరుకున పెట్టేందుకు వైసీపీ అకస్మాత్తుగా అవిశ్వాసం తెరపైకి తెచ్చింది.ఆ క్రమంలో సభా నిబంధనలను సరిగ్గా అధ్యయనం చేయక అనేక తడబాట్లకు గురైంది. ఎవరు ప్రారంభించాలి ఎలా ముగించాలి వరకూ అంతా అధికార పక్షం పాచికల మేరకు జరిగిపోయింది. అనుభవం లేకపోవడం తప్పు కాదు గాని ఆ మేరకు సలహాలు సూచనలు తీసుకుని సమగ్రంగా సన్నద్ధం కాకపోవడం పొరబాటే. ఏదైతేనేం మూజువాణి తతంగంతో ఫిరాయింపు ఎంఎల్‌ఎలకు పాలకపక్షం చక్రం అడ్డం వేసింది. ఆ వెంటనే వైసీపీ స్పీకర్‌పై అవిశ్వాసాన్ని ముందుకు తెచ్చింది. గత సమావేశాలు ముగిసిన నాటి నుంచి ఈ మాట వినిపిస్తూనే వుంది గాని మొన్న హఠాత్తుగా ప్రభుత్వంపై అవిశ్వాసం అన్నారు. ఆ ప్రహసనం ముగిశాక ఇప్పుడు మళ్లీ స్పీకర్‌ పై తీర్మానం ముందుకు తెస్తున్నారు. అంటే అదే తంతు మరోసారి పునరావృతం కావడం తప్ప అదనంగా ఒరిగేది వుండదు. ఫిరాయింపుల చట్టం అమలుకు సంబంధించి అసంఖ్యాకమైన లొసుగులున్నాయి గనక విప్‌లు బ్రహ్మాస్త్రాలని భావించడానికేమీ లేదు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ వైఖరిని విమర్శించేందుకు అవకాశం లభిస్తుందేమో గాని అదనంగా ఒరిగేది శూన్యం. పైగా ఇలా వెంటవెంట దెబ్బతింటే ప్రతిపక్షంపై సందేహాలు పెరుగుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close