వైకాపా వికెట్‌ మరోటి తెదేపా గూటికి !

అటు కడప జిల్లానుంచి, లేదా కేఈ కృష్ణమూర్తి ఇచ్చిన లీకులు నిజమైతే కర్నూలు జిల్లానుంచి వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి ఫిరాయించడం ఉంటుందేమో అని అందరూ ఎదురుచూస్తూ ఉండగా.. అనూహ్యంగా నెల్లూరు రాజకీయాలు అలాంటి కబురును తెరమీదకి తెచ్చాయి. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వైకాపా ఎమ్మెల్యే సునీల్‌ తెలుగుదేశంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తమ జిల్లాకే చెందిన కీలక మంత్రి నారాయణతో ఇదివరలోనే మంతనాలు జరిపి.. మొత్తం తన చేరికకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే సునీల్‌.. మంగళవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత.. చంద్రబాబునాయుడును కూడా కలిసి పార్టీలో చేరికను ఖరారు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఇవాళో రేపో కడప జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపానుంచి తెదేపా తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో మంగళవారం నాడు డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ.. మరో నలుగురు ఎమ్మెల్యేలు తెదేపాలోచేరబోతున్నారనే కబురును మీడియా ముఖంగా లీక్‌ చేశారు. కర్నూలు జిల్లానుంచి ఇంకా తెదేపాలోకి వచ్చే వికెట్లు ఉన్నాయనే పుకార్లు నడుస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన అగ్రనేత కేఈ ప్రకటన.. కడప కర్నూలు జిల్లాల వారి గురించి అని అంతా లెక్కలు వేశారు.

అయితే అనూహ్యంగా నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే చంద్రబాబును కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం ఆసక్తికరం. అయితే అభిజ్ఞ వర్గాలనుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. నెల్లూరు జిల్లాలోనే మరికొందరు వైకాపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి బలమైన దన్నుగా నిలిచిన వారు కూడా తెదేపాలో చేరిక కోసం మంచి ముహూర్తాలు వెతుకుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close